Prakash raj: అది నా ఒక్కడి నిర్ణయం కాదు
ABN, First Publish Date - 2021-09-13T17:09:32+05:30
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారం మొదలైంది. వమా’ సభ్యులందరికీ విందులు, సన్మానాలతో ప్రచారం మొదలు పెట్టాయి రెండు ప్యానళ్లు. సినిమా బిడ్డలం ప్యానల్ నుంచి అధ్యక్షుడిగా బరిలో దిగుతున్న ప్రకాశ్‌రాజ్ ఆదివారం 150 మంది కళాకారులతో విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నటీనటులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నటీనటుల కష్టాలను తెలుసుకున్నాం
నోటిఫికేషన్ తర్వాత మేనిఫెస్టో..
‘మా’ సంక్షేమం పైనే దృష్టి
గణేశ్‌ని బాధ పెట్టలేదు
– ప్రకాశ్‌రాజ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారం మొదలైంది. వమా’ సభ్యులందరికీ విందులు, సన్మానాలతో ప్రచారం మొదలు పెట్టాయి రెండు ప్యానళ్లు. సినిమా బిడ్డలం ప్యానల్ నుంచి అధ్యక్షుడిగా బరిలో దిగుతున్న ప్రకాశ్‌రాజ్ ఆదివారం 150 మంది కళాకారులతో విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నటీనటులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘మా’ అభివృద్థి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తమ మేనిఫెస్టోను ప్రకటిస్తామని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. ‘‘మాకు ఓటేేసవాళ్లనే మేం సమావేశానికి పిలవలేదు. మా ప్యానల్‌లో టెలివిజన్ నటులతోపాటు భిన్నమైన, శాఖలకు చెందిన వారు ఉన్నారు. వారితోపాటు నటులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముందు వాళ్లకే మైక్ ఇచ్చి ుఇన్నేళ్లుగా సభ్యులుగా ఉన్నారు కదా.. ఎలాంటి సాయం అందింది. ఇంకా ఎలాంటి సమస్యలున్నాయని అడిగి తెలుసుకున్నాం’’ అని ప్రకాశ్‌రాజ్ అన్నారు.
బండ్ల గణేశ్ తన ప్యానల్ నుంచి తప్పుకోవడం గురించి ప్రకాశ్‌రాజ్ స్పందించారు. ‘‘నేనైతే గణేశ్‌ని బాధ పెట్టలేదు. ప్యానల్ ప్రకటించడం నా ఒక్కడి నిర్ణయం కాదు. 900లకు పైగా సభ్యులున్న అసోసియేషన్‌లో అన్ని పదవులు ఉండవు కదా. ఆయనకి జీవిత నచ్చకపోవచ్చు. ‘మా’ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేేసవాళ్లు కావాలని మేం కోరి తీసుకొచ్చాం’’ అన్నారు. ఈ ఎన్నికల్లో ‘మా’లో సభ్యత్వం ఉన్న స్టార్ హీరోలంతా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారని నమ్ముతున్నాను. మరోపక్క మంచు విష్ణు ప్యానల్ సమావేశాల్ని ఏర్పాటు చేసి, సీనియర్ ఆర్టిస్ట్‌లకు సన్మానం చేస్తోంది. నోటిఫికేషన్ వచ్చాక ప్రచారం ఊపు మరింత పెరిగేలా కనిపిస్తోంది.