సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఎన్నికల అధికారి నిరాకరిస్తున్నారు : ప్రకాశ్ రాజ్

ABN , First Publish Date - 2021-10-18T18:17:27+05:30 IST

‘మా’ ఎన్నికల రోజున తమ ప్యానల్ సభ్యుల పై దాడి జరిగిందని కంప్లైంట్ చేస్తూ, దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను ఎన్నికల అధికారిని ప్రకాశ్ రాజ్ కోరుతూ ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ను తాము పరిశీలించామని అందులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, మీరు అడిగితే సీసీ టీవీ ఫుటేజ్ అందజేస్తామని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ తెలిపారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఓ ట్విస్ట్ జరిగింది.

సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఎన్నికల అధికారి నిరాకరిస్తున్నారు : ప్రకాశ్ రాజ్

‘మా’ ఎన్నికల రోజున తమ ప్యానల్ సభ్యుల పై దాడి జరిగిందని కంప్లైంట్ చేస్తూ, దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను ఎన్నికల అధికారిని ప్రకాశ్ రాజ్ కోరుతూ ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ను తాము పరిశీలించామని అందులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, మీరు అడిగితే  సీసీ టీవీ ఫుటేజ్ అందజేస్తామని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ తెలిపారు. అయితే  ఇప్పుడు ఈ విషయంలో ఓ ట్విస్ట్ జరిగింది. ఈ రోజు మా ఎన్నికల సీ సీ టివి ఫుటేజ్ ని సిజ్ చేసే క్రమంలో పోలీసులు జూబ్లీ హిల్స్  పబ్లిక్ స్కూల్ కు చేరుకున్నారు. దాంతో మాపై దాడిచేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నాయని, వాటిని తమకు అందజేయాలని ఎన్నికల అధికారిని ప్రకాశ్ రాజ్ పబ్లిక్ స్కూల్ కి వెళ్ళి కోరగా..  వాటిని ఇవ్వడానికి ఎన్నికల అధికారి నిరాకరించారు. ఈ నేపథ్యంలో వివాదం నెలకొంది. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసుకునేందుకు స్కూల్ కి వచ్చానని, మా ఎన్నికలు ఎలా జరిగాయి అన్నదానిపై తనకి అనుమానాలు ఉన్నాయని, ఎన్నికల సమయంలో ఉద్రిక్తత జరిగిందని,  వాటిని తమకు తెలపాలని అడుగుతున్నా,  ఎన్నికల అధికారి కృష్ణ మోహన్  దానికి సమాధానం ఇవ్వడం లేదని, సీసీటీవీ ఫుటేజ్ చూడమని విష్ణు అంటున్నా ఎన్నికల అధికారి మాత్రం కోర్ట్ కు వెళ్ళండి అంటున్నారని, ఈ విషయంలో విష్ణు చాలా నమ్మకంగా ఉన్నారని, తనకు అసలు సమస్య మా ఎన్నికల అధికారితోనే అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.  

Updated Date - 2021-10-18T18:17:27+05:30 IST