HBD Prabhas: ఆ ధైర్యం చేసిన ఏకైక హీరో డార్లింగే!
ABN , First Publish Date - 2021-10-23T20:56:23+05:30 IST
గల్లీ కుర్రాడి పాత్రతో కెరీర్ మొదలుపెట్టిన ప్రభాస్.. ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. మాస్ హీరోగా, డ్రీమ్ బాయ్‌గా, ‘బాహుబలి’ లాంటి బలమైన పాత్రలతో వైవిధ్యమైన నటుడు అనిపించుకున్నారు. రాజమౌళి కలకయిలో వచ్చిన ‘బాహుబలి’తో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచ దేశాలకు తెలియజేశారు. ఇప్పుడు ప్రభాస్ అంటే ప్యాన్ ఇండియా స్టార్... భారీ బడ్జెట్ చిత్రాలు అన్నవే గుర్తొస్తున్నాయి. గురువారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.

గల్లీ కుర్రాడి పాత్రతో కెరీర్ మొదలుపెట్టిన ప్రభాస్.. ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. మాస్ హీరోగా, డ్రీమ్ బాయ్‌గా, ‘బాహుబలి’ లాంటి బలమైన పాత్రలతో వైవిధ్యమైన నటుడు అనిపించుకున్నారు. రాజమౌళి కలకయిలో వచ్చిన ‘బాహుబలి’తో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచ దేశాలకు తెలియజేశారు. ఇప్పుడు ప్రభాస్ అంటే ప్యాన్ ఇండియా స్టార్... భారీ బడ్జెట్ చిత్రాలు అన్నవే గుర్తొస్తున్నాయి. గురువారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ప్రభాస్ తన స్కూలింగ్ అంతా విజయవాడలో పూర్తి చేశారు. హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తి చేశారు. సినిమా వాతావరణంలో పెరిగినా తనకు చిన్నప్పటి నుంచి నటుడు కావాలనే ఆలోచన ఉండేది కాదు. తన అందం, హైట్ చూసి చాలామంది ‘హీరోలా ఉన్నావ్’ అని అంటుండేవారు. అయినా తనకు హీరోగా కావాలనే ఆలోచన రాలేదు. తన పెదన్నాన్న కృష్ణంరాజు సినిమా షూటింగ్‌లకు వెళ్లినప్పుడు హీరో కావడం అంత సులువు కాదని ప్రభాస్‌కు బలంగా నాటుకుపోయింది. దాంతో ఆ ఆలోచన విరమించుకున్నాని ప్రభాస్ చెబుతుంటారు. స్వతహాగా ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజుకు వీరాభిమాని. ‘భక్త కన్నప్ప’ సినిమా చూసి పెదనాన్నలా హీరో కావాలని డార్లింగ్ డిసైడ్ అయ్యారు. అప్పుడు వైజాగ్ సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ పొంది.. ‘ఈశ్వర్’ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించారు. ఆ సినిమాతో అంతగా ఆడకపోయినా నటనకు మంచి మార్కులే తెచ్చుకున్నారు. రెండో సినిమా ‘రాఘవేంద్ర’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మూడో సినిమా ‘వర్షం’ విడుదల రోజు మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ రెండోవారంలో సూపర్‌హిట్ అందుకున్నారు. ‘ఛత్రపతి’ సినిమా నుంచి ప్రభాస్ రేంజ్ మారిపోయింది. వరుసగా బడా దర్శకులతో సినిమాలు చేశారు. వాటిలో కొన్ని సక్సెస్ కాకపోయినా.. ప్రభాస్ మాత్రం హీరోగా నిరూపించుకున్నారు. మాస్, యాక్షన్, ఎమోషన్ ఓ జానర్ సినిమాకైనా బ్రాండ్లా మారారు. మొదట్లో రెండు సినిమాలు హిట్ అయితే రెండు సినిమా ఫ్లాప్ అయ్యేవి. పరాజయాలకు ఆయన కుంగిపోలేదు. పడిలేచిన కెరటంలా తనను తాను నిరూపించుకుంటూ ముందడుగులు వేశారు. ‘బుజ్జిగాడు’తో కొత్త మేనరిజాన్ని పరిచయం చేసిన ఆయన ‘బిలా’్లతో స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘మిర్చి’, ‘డార్లింగ్’, మాస్, క్లాస్ హీరోగా గుర్తింపు పొందారు. లవర్‌బాయ్ ఇమేజ్‌నూ సొంతం చేసుకున్నారు. ఇక ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా సత్తా చాటారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆయనొక స్టార్.
24 గంటలూ సినిమా ఆలోచనే..
ఇరవై నాలుగు గంటలూ సినిమా గురించే ఆలోచించే హీరో ప్రభాస్. ఉదయం నుంచీ అర్ధరాత్రి నిద్రపోయేలోపు ఓ 500 మాటలు మాట్లాడితే అందులో 99 శాతం సినిమా గురించే ఉంటాయని ఆయన స్నేహితుడు, స్టైలిస్ట్ భాస్కి ఓ సందర్భంలో చెప్పారు. సినిమా ప్రారంభం నుంచీ టెక్నీషియన్లు ఎంత కష్టపడి పనిచేస్తారో. ప్రభాస్ కూడా వాళ్లతో సమానంగా కష్టపడతారని సన్నిహితులు చెబుతుంటారు.
చిన్న నిక్కరు, బనియన్‌తో..
సినిమా కోసం ఏ డ్రెస్ ఇచ్చినా ప్రభాస్ వేసుకుంటాడు. పర్సనల్‌గా మాత్రం చాలా సింపుల్‌గా ఓ పలచని చొక్కా, ప్యాంట్ వేసుకుంటాడంతే! నాకిదే కంఫర్ట్ అంటాడు. ఫంక్షన్ వెళ్లాలి సూట్, బ్లేజర్ అన్నా వేసుకో అంటే.. ‘వద్దురా నలుగురిలో బాగోదు’ అనే తత్వం అంటాడు. ఇక ఇంట్లో ఉంటే చిన్న నిక్కర్, బనియన్ వేసుకుని తిరుగుతాడు. బయటోళ్లు చూేస్త ప్రభాేసనా అని కంగారు పడతారు. ఆయన కొత్తదానాన్ని బాగా ఇష్టపడతాడు. ఎవరూ చేయని ప్రయత్నం చేయాలని తపన పడుతుంటాడు.
అది నెవర్ ఎండింగ్ టాపిక్...
ఇక ప్రభాస్ పెళ్లి విషయానికొస్తే.. ‘మా పిల్లలంతా పెద్దోళ్లు అయిపోతున్నారు.. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్’ అని తరచూ ఆయన స్నేహితులు అడుగుతుంటారు. ఆయన మాత్రం సమాధానం చెప్పకుండా నవ్వేస్తారంతే! పెళ్లి విషయంలో ఎన్ని వార్తలు వచ్చినా ప్రభాస్ సమాధానం చిన్న చిరునవ్వే. తన స్నేహితులను ఇదే ప్రశ్న అడిగితే.. అదొక నెవర్ ఎండింగ్ స్టోరీ అంటారు. అలాగే ఆయనకు వాలీబాల్ అంటే ప్రాణం. ఆయన ఇంటి దగ్గర ప్రత్యేకంగా వాలీబాల్ కోర్ట్ ఏర్పాటు చేసుకున్నారు.

హీరో కాకపోతే..
స్నేహితులు, శ్రేయోభిలాషులు, తోటి నటీనటులకు ఆయన ఇచ్చే గౌరవం మాటల్లో చెప్పలేమంటారు వెల్‌విషర్స్. ఇక ప్రభాస్ ఇచ్చే అతిథ్యం అయితే మరచిపోయే ప్రసక్తే ఉండదు. ఆయన ఆతిథ్యం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే భోజనం క్యారేజ్ అంటే సెట్లో ప్రతి ఒక్కరికీ నోరూరాల్సిందే. ఇంట్లో ఆయన వండించే వంటలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. మినిమమ్ 20 రకాలు లేనిదే ఇంట్లో భోజనం వడ్డించరు. ప్రభాస్ ఇంటి వంటకు బాలీవుడ్ ఆర్టిస్ట్‌లు సైతం ఫ్యాన్సే. హీరో కాకుంటే ఉంటే హోటల్ లేదా రెస్టారెంట్ బిజినెస్ పెట్టుకునేవాడిని అని ప్రభాస్ చెబుతుంటారు.
కమిట్ అయితే వినేదేలేదు..
కొందరు స్టార్ హీరోలు ఏడాదికి రెండు సినిమాలు ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడాదికి ఒక సినిమా కూడా కష్టంగానే ఉంది. అలాంటిది ప్రభాస్ ఐదేళ్ల పాటు ఒకే సినిమా కోసం కష్టపడి... మరో సినిమాకు డేట్స్ ఇవ్వలేదు. ఈ జనరేషన్ హీరోల్లో ఆ డేర్ చేసింది ప్రభాస్ ఒక్కరే! ‘బాహుబలి’ కోసం రాజమౌళికి ఐదేళ్ల కాల్షీట్లు రాసిచ్చేశారు. అదే సినిమాలో పని చేసిన చాలామంది ఆర్టిస్ట్‌లు వేరే చిత్రాల్లో చేసినా ప్రభాస్ మాత్రం డెడికేషన్‌తో ఆ చిత్రానికి మాత్రమే పని చేశారు. అయితే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. ప్రభాస్‌ని ఫ్యాన్ ఇండియా స్టార్‌ని చేసింది. దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించింది. ఇప్పుడు ఆయన సినిమా అంటే ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఆతురతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘స్పిరిట్’ చిత్రాలు ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. బాలీవుడ్ మేకర్స్ సైతం ప్రభాస్‌తో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ‘బాహుబలి’ కన్నా ముందే ప్రభాస్ బాలీవుడ్ తెరపై కనిపించారు. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘యాక్షన్ జాక్సన్(2014)లో ఓ పాటలో మెరిశారు డార్లింగ్.
‘అందరూ మన స్నేహితులే కదరా’
ప్రభాస్‌కి సినిమాలంటే ఎంత పిచ్చో... స్నేహితులన్నా అంతే పిచ్చి. స్నేహం కోసం ఏం చేయడానికైనా ఆయన సిద్ధం అని తన స్నేహితులు ఎంతో గర్వంగా చెబుతుంటారు. ఎవర్నైనా పిలిచి నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఒకట్రెండు పేర్లు చెబుతారు. కానీ ప్రభాస్ మాత్రం పదిహేనుకు పైగా చెబుతారు. వీళ్లలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అంటే చెప్పలేరు.. ‘అందరూ మన స్నేహితులే కదరా’ అంటారు. వర్క్ ప్రెజర్ ఎక్కువై రిలాక్స్ అవ్వాలంటే ఆయన నుంచి ఫస్ట్ కాల్ వెళ్లేది స్నేహితులకే! అందర్నీ ఆయనే కాల్ చేసి పిలిపించుకుంటాడు. స్నేహితులంతా కూర్చొని తింటుంటే ‘ఓరేయ్ ఏంట్రా నీ కంచంలో కూర ఎర్రగా కలర్ఫుల్గా ఉంది. ఓ ముద్ద పెట్టరా’ అంటారాయన. చుట్టూ ఫ్రెండ్స్ ఉంటే ప్రభాస్ కంచంలో తినేది చాలా తక్కువసార్లు. స్నేహితులే ఎంతో ప్రేమగా ముద్దలు కలిపి తినిపిస్తుంటారు. ప్రతి వ్యక్తి ప్రభాస్ లాంటి స్నేహితుడు ఒకరుంటే చాలని ఆయన చుట్టూ ఉండే స్నేహితులంతా అంటుంటారు. ేస్నహితులను గుడ్డి నమ్మేస్తాడు. ప్యాన్ ఇండియా స్థాయికి చేరుకున్నా తన స్నేహంలో ఎలాంటి మార్చు లేదని చెబుతుంటారు. కెరీర్ పరంగా తనను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి అంటే ప్రభాస్‌కి ఎంతో అభిమానం.
