‘మా’ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు: పేర్ని

ABN , First Publish Date - 2021-10-04T22:28:10+05:30 IST

ఈ నెల పదో తేదీన జరగబోయే ‘మా’ ఎన్నికలకు, వైసీపీ ప్రభుత్వానికి, జగన్‌మోహన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వం ఏ వ్యక్తినీ, వర్గాన్నీ సమర్ధించడం లేదని ఆయన తెలిపారు. తెలుగు పరిశ్రమ వారందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నా అని మంత్రి అన్నారు.

‘మా’ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు: పేర్ని

ఈ నెల పదో తేదీన  జరగబోయే ‘మా’ ఎన్నికలకు, వైసీపీ ప్రభుత్వానికి, జగన్‌మోహన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వం ఏ వ్యక్తినీ, వర్గాన్నీ సమర్ధించడం లేదని ఆయన తెలిపారు. తెలుగు పరిశ్రమ వారందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నా అని మంత్రి అన్నారు. ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య ఎన్నికల ప్రయారం వాడీవేడిగా సాగుతోంది. విమర్శలు, మాటల దాడులు రోజురోజుకీ శ్రుతిమించుతున్నాయి. సినిమా పరిశ్రమ కళాకారులంతా ఒకటి అంటూనే ‘మా’ ఎన్నికల పేరుతో ‘ఎవరికి వారు యమునా తీరే’ అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ ఎన్నికలకు రాజకీయం రంగు పులమొద్దు అంటూనే చేయాల్సిన పనులు చేస్తున్నారు అభ్యర్థులు. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి పేర్ని నాని ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.


Updated Date - 2021-10-04T22:28:10+05:30 IST