నూకల సాంబశివరావుపై జగ్గయ్యపేట పీఎస్‌లో రౌడీషీట్‌ : ప్రకాష్‌రాజ్‌

ABN , First Publish Date - 2021-10-22T19:21:02+05:30 IST

‘మా’ ఎన్నికల్లో అక్రమాలు జరగాయన్న కోణంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించానని, అక్రమాలు జరగడం నిజమేనని ప్రకాశ్ రాజ్ మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఆయన పాయింట్ అవుట్ చేసిన నూకల సాంబశివరావు అనే రౌడీ షీటర్ పై షాకింగ్ విషయాల్ని వెల్లడించారు ప్రకాశ్ రాజ్. గతంలో ఓ హత్యకేసులో నూకల సాంబశివరావు ప్రధాన నిందితుడని, నోట్ల రద్దు సమయంలో కోట్ల రూపాయలు తరలించినట్టు అతడిపై ఆరోపణలున్నాయని, అడ్డుకున్న ఎస్‌ఐపై కారు ఎక్కించి హత్య చేయబోయినవాడు సాంబశివరావని చెప్పారు ప్రకాశ్ రాజ్.

నూకల సాంబశివరావుపై జగ్గయ్యపేట పీఎస్‌లో రౌడీషీట్‌ : ప్రకాష్‌రాజ్‌

‘మా’ ఎన్నికల్లో అక్రమాలు జరగాయన్న కోణంలో  సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించానని, అక్రమాలు జరగడం నిజమేనని ప్రకాశ్ రాజ్ మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఆయన పాయింట్ అవుట్  చేసిన నూకల సాంబశివరావు అనే రౌడీ షీటర్ పై షాకింగ్ విషయాల్ని వెల్లడించారు ప్రకాశ్ రాజ్.  గతంలో ఓ హత్యకేసులో  నూకల సాంబశివరావు ప్రధాన నిందితుడని, నోట్ల రద్దు సమయంలో కోట్ల రూపాయలు తరలించినట్టు అతడిపై  ఆరోపణలున్నాయని, అడ్డుకున్న ఎస్‌ఐపై కారు ఎక్కించి హత్య చేయబోయినవాడు సాంబశివరావని చెప్పారు ప్రకాశ్ రాజ్.  ఇంకా సాంబశివరావుపై అనేక బెదిరింపులు, సెటిల్‌మెంట్ల కేసులున్నాయని, రౌడీషీటర్లు చాలామంది ఎన్నికల్ని ప్రభావితం చేశారని,  అందుకే ఈసీని సీసీ పుటేజ్‌ అడుగుతున్నాం అని, సీసీ పుటేజ్‌తో అసలేం జరిగిందో జనాలకు తెలుస్తుందని, 14వ తేదీనే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని ప్రకాష్‌రాజ్‌ అన్నారు. 

Updated Date - 2021-10-22T19:21:02+05:30 IST

Read more