సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nagarjuna: మాటిచ్చారు.. అవకాశాలిచ్చారా?

ABN, First Publish Date - 2021-08-06T23:00:39+05:30

ప్రతిభ ఉంటే అవకాశం దానంటత అదే వస్తుందంటారు. కానీ చిత్ర పరిశ్రమలో అది అరుదుగా జరుగుతుంది. ఇక్కడ ప్రతిభకు అదృష్టం కూడా తోడవ్వాలి. ప్రతిభ ఉండి నిరూపించుకోవడానికి అవకాశాలు దొరకక ఇబ్బందులు పడేవారు చాలామంది ఉంటారు. గత ఏడాది ‘బిగ్‌బాస్‌ –4’ సీజన్‌లో ఇంటి సభ్యులుగా పాల్గొన్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతిభ ఉంటే అవకాశం దానంటత అదే వస్తుందంటారు. కానీ చిత్ర పరిశ్రమలో అది అరుదుగా జరుగుతుంది. ఇక్కడ ప్రతిభకు అదృష్టం కూడా తోడవ్వాలి. ప్రతిభ ఉండి నిరూపించుకోవడానికి అవకాశాలు దొరకక ఇబ్బందులు పడేవారు చాలామంది ఉంటారు. గత ఏడాది ‘బిగ్‌బాస్‌ –4’ సీజన్‌లో ఇంటి సభ్యులుగా పాల్గొన్న పలువురికి నాగార్జున అదే వేదికపై తన సినిమాల్లో, ప్రొడక్షన్‌లో తెరకెక్కే చిత్రాల్లో అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తానని మాటిచ్చారు. మాట నిలబెట్టుకున్నారా.. ఇచ్చిన మాట ప్రకారం అవకాశాలిస్తారా? అన్నది విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బిగ్‌బాస్‌ 5 సీజన్‌ త్వరలో రాబోతున్న నేపథ్యంలో నెటిజన్లకు ఈ విషయం గుర్తొచ్చినట్లుంది. 





గత బిగ్‌బాస్‌ సీజన్‌లో ఇంటి సభ్యులుగా అలరించిన వారి ప్రతిభను గుర్తించి సినిమా అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్‌ చేస్తానని, పలువురు దర్శకులకు రికమండ్‌ చేస్తానని నాగార్జున మాటిచ్చిన సంగతి తెలిసిందే! హౌస్‌ నుంచి బయటికొచ్చిన చాలామందికి బిగ్‌బాస్‌ వల్ల మంచి గుర్తింపే వచ్చింది. సినిమాల్లో అవకాశాలూ అందుకుంటున్నారు. అఖిల్‌ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. ఆరియానా కూడా ఆడపాదడపా సినిమాల్లో కనిపస్తోంది. ఆమెకు ఆర్‌జీవీ సపోర్ట్‌ ఎలాగో ఉంది. అయితే నాగార్జున మాటిచ్చిన ప్రకారం ఆమెకు అన్నపూర్ణ సంస్థ నిర్మిస్తున్న సినిమాలో అవకాశం ఇచ్చారని తెలిసింది. ఇందులో రాజ్‌తరుణ్‌ కథానాయకుడు. 




మరో సొట్టబుగ్గల సుందరి దివి కూడా ఈ మఽధ్యకాలంలో రెండు సినిమా మెరిశారు. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కల్యాణ్‌కృష్ణ, మరో నిర్మాత కలిసి నిర్మిస్తున్న సినిమాలో దివి నటించారు. నాగార్జునే ఈ సినిమాకు రికమండ్‌ చేశారని టాక్‌. మెగాస్టార్‌ చిరంజీవి కూడా తన తదుపరి చిత్రంలో దివికి అవకాశం ఇచ్చారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘వేదాళం’కు రీమేక్‌గా రూపొందనున్న సినిమాలో దివి పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘క్యాబ్‌ స్టోరీస్‌’ సినిమా విడుదలైంది. 



ఇక బిగ్‌బాస్‌ హౌస్‌కి గ్లామర్‌ డాల్‌గా గుర్తింపు తెచ్చుకున్న గుజరాతీ బ్యూటీ మోనల్‌కి కూడా నాగార్జున ఆయన నటించే చిత్రంలో అవకాశం ఇచ్చారని టాక్‌ నడుస్తోంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్‌గా రూపొందనున్న ‘బంగార్రాజు’ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో మోనల్‌ కనిపించనుందట. గతంలో అనుసూయ నటించిన పాటలో ఇప్పుడు మోనల్‌ స్టెప్పులేయనుందని తెలిసింది. ఇక గంగవ్వ విషయానికొస్తే ఆయన అన్న మాట ప్రకారం ఇల్లు కట్టిస్తున్నారు. ఆర్టిస్ట్‌ కుమార్‌ సాయి నాగార్జునకు ఓ కథ చెప్పాలనుకున్నట్లు షోలో వెల్లడించారు. తప్పకుండా కథ వింటానని నాగ్‌ మాటిచ్చారు. ఆయన ఇచ్చిన మాటల్లో ఇదొక్కటే జరగాల్సినట్లు కనిపిస్తోంది. 

Updated Date - 2021-08-06T23:00:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!