ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో గెలిచినవారి రాజీనామాలు అందలేదు : మంచు విష్ణు

ABN , First Publish Date - 2021-10-18T15:37:04+05:30 IST

‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఇటీవలే ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. నూతన కార్యవర్గాన్ని కూడా ఇటీవలే ఏర్పాటు చేసుకున్న మంచు విష్ణు నేడు తండ్రి మోహన్ బాబు, అక్క లక్ష్మీ ప్రసన్నతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తండ్రీ, కొడుకులు మీడియాతో మాట్లాడారు. మోహన్ బాబు మాట్లాడుతూ.. శ్రీవారి ఆశీస్సులు, 'మా' సభ్యుల సహకారంతో విష్ణు గెలిచాడని, ఈ పదవి చాలా బాధ్యతతో కూడుకున్నదని, ‘మా’ గౌరవానికి ఎలాంటి లోటు రాకుండా విష్ణు వ్యవహరిస్తాడని తెలిపారు.

ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో గెలిచినవారి రాజీనామాలు అందలేదు : మంచు విష్ణు

‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఇటీవలే ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. నూతన కార్యవర్గాన్ని కూడా ఇటీవలే ఏర్పాటు చేసుకున్న మంచు విష్ణు నేడు తండ్రి మోహన్ బాబు, అక్క లక్ష్మీ ప్రసన్నతో  కలిసి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తండ్రీ, కొడుకులు మీడియాతో మాట్లాడారు. మోహన్ బాబు మాట్లాడుతూ..  శ్రీవారి ఆశీస్సులు, 'మా' సభ్యుల సహకారంతో విష్ణు గెలిచాడని, ఈ పదవి చాలా బాధ్యతతో కూడుకున్నదని, ‘మా’ గౌరవానికి ఎలాంటి లోటు రాకుండా విష్ణు వ్యవహరిస్తాడని తెలిపారు. మంచు విష్ణు మాట్లాడుతూ.. 'మా' అధ్యక్షుడిగా ఎన్నికవడంతో స్వామి వారికి మొక్కులు చెల్లించానని, 'మా' సభ్యుల రాజీనామా అంశం మీడియా ద్వారానే తెలిసిందని, ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో గెలిచినవారి రాజీనామాలు ఇంకా అందలేదని తెలిపారు. 

Updated Date - 2021-10-18T15:37:04+05:30 IST