మంచు విష్ణు గెలుస్తాడని పదిరోజుల ముందే చెప్పాను : మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ABN , First Publish Date - 2021-10-16T18:29:35+05:30 IST
నేడు (శనివారం) ‘మా’ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం 11గంటలకు ఫిల్మ్ ఛాంబర్ లో పూజానంతరం జరిగిన ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పలువురు సినీ ప్రముఖుల్ని మంచు విష్ణు ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

నేడు (శనివారం) ‘మా’ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం 11గంటలకు ఫిల్మ్ ఛాంబర్ లో పూజానంతరం జరిగిన ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పలువురు సినీ ప్రముఖుల్ని మంచు విష్ణు ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ..
‘మా ఎన్నికలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను తలపించాయి. మా చిన్న అసోసియేషన్ కాదు.. ఇదో పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థ ను ఓ యువకుడు తన భుజస్కంధాలపై మోసుకున్నాడు. మోహన్ బాబు, మంచు విష్ణు కు చదువు తో పాటు సంస్కారం నేర్పించాడు. మోహన్ బాబు కు కోపం ఆవేశం ఎక్కువ అంటారు. కానీ ఆ ఆవేశం కోపం ఆయనకు నష్టం చేసింది తప్ప ఇతరులకు కాదు. మోహన్ బాబు ముక్కు సూటి తత్త్వాన్ని కోపం అనుకుంటారు.. ఆ అభిప్రాయం తప్పు. మంచి టీం ను ‘మా’ సభ్యులు ఎన్నుకున్నారు. సంతోషం. విష్ణు కు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. భారతదేశానికి సినిమా ఇండస్ట్రీకి హబ్ ఉండాలని సీఎం ఆలోచిస్తున్నారు. సినిమా షూటింగ్ల కోసం సింగిల్ విండో విధానం ప్రవేశ పెట్టి అన్ని అనుమతులు ఒకేసారి ఇస్తున్నాం. టికెటింగ్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయని ప్రొడ్యూసర్ చెప్తే ఆన్లైన్ టికెటింగ్ కు అంకురార్పణ చేసింది తెలంగాణ ప్రభుత్వం. షూటింగ్కు అనువైన అనేక ప్రాంతాలను ప్రభుత్వం నిర్మించింది. కరోనా వల్ల సినిమా వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. థియేటర్ లో సినిమా చూడాలని ప్రజలను కోరుతున్నాను. పైరసీ అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నాం. కళామతల్లి మన జీవితంతో పాటు సమాజ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. 900 కాదు 9000 వేల మందిని నడిపే సత్తా ‘మా’కు ఉంది. సినిమా ఇండస్ట్రీ విషయంలో సీఎం కు ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. దేశంలో సినిమా ఇండస్ట్రీ ప్రముకంగా నిలబెట్టడానికి ప్రభుత్వం దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. కొత్త మా టీం ను సీఎం వద్దకు తీసుకెళ్తాము. హైదరాబాద్ లో సినిమా రంగంపై కొన్ని లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. కొత్త మా టీం సమిష్టిగా కృషి చేసి మా ను మరింత ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నామ్.. మా టీం వెనుక మేము ఉంటాం. ప్రభుత్వం తరపున అన్ని సంక్షేమ కార్యక్రమాలు కళాకారులకు వర్తించేలా చూస్తాం. మంచు విష్ణు గెలుస్తాడాని పది రోజుల ముందే చెప్పాను’ అని అన్నారు.