ఆ ఇద్దరూ మోసగాళ్లు: మంచు విష్ణు

ABN , First Publish Date - 2021-10-12T02:21:13+05:30 IST

‘మా’ తుది ఫలితాల అనంతరం మంచు విష్ణు మీడియాతో ముచ్చటించారు. రెండు జట్లు పోటీలో తలపడినప్పుడు విజయం ఒక జట్టునే వరిస్తుందని, అదే జరిగిందని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏ గేమ్ ఆడినా.. అందులో ఒక జట్టు మాత్రమే గెలుస్తుంది. ఈరోజు ఆ విన్నర్ నేనవ్వడం

ఆ ఇద్దరూ మోసగాళ్లు: మంచు విష్ణు

‘మా’ తుది ఫలితాల అనంతరం మంచు విష్ణు మీడియాతో ముచ్చటించారు. రెండు జట్లు పోటీలో తలపడినప్పుడు విజయం ఒక జట్టునే వరిస్తుందని, అదే జరిగిందని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏ గేమ్ ఆడినా.. అందులో ఒక జట్టు మాత్రమే గెలుస్తుంది. ఈరోజు ఆ విన్నర్ నేనవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. నా తల్లిదండ్రులు, ‘మా’ సభ్యులు, శ్రేయోభిలాషుల సపోర్ట్‌తో ఈ విజయం వరించింది. అవతలి ప్యానెల్ వారు కూడా మా సభ్యులే. అందరం కలిసి పని చేస్తాం. కొన్నిసార్లు గేమ్ ఆడినప్పుడు డిజప్పాయింట్ హెవీగా ఉంటుంది. అది నాకు తెలుసు. నేను కూడా స్పోర్ట్స్ పర్సన్‌నే. బాస్కెట్ బాల్ ప్లేయర్‌ని. మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు ఇంటికెళ్లి ఏడ్చిన రోజులున్నాయి. అలాగే నటీనటులకు డిజప్పాయింట్ అనేది మా అందరికీ అలవాటే. సినిమా విజయం సాధిస్తే హ్యాపీగా ఉంటాం.. సరిగా ఆడనప్పుడు కుమిలిపోతాం. బయటికి చూపించుకోలేం. మేమంతా ఎమోషనల్ పీపుల్స్. 


ప్రకాశ్ రాజ్ గారు నాకు మెసేజ్ పెట్టారు. ఆల్ ద బెస్ట్ విష్ణు.. నేను రిజైన్ చేస్తున్నా.. యాక్సెప్ట్ చెయ్ అని. నేను మళ్లీ మెసేజ్ పెట్టా.. నాకన్నా పెద్దవారు మీరు. గెలుపు, ఓటమి అనేది ఒక కాయిన్‌లో బొమ్మ, బొరుసు వంటివి. ఒక పక్క గెలుపుంటుంది. మరొపక్క ఓటమి ఉంటుంది. గెలుపు, ఓటమి.. ఈ ఇద్దరూ మోసగాళ్లే. ఎవరూ మనతో ఎప్పుడూ శాశ్వతంగా ఉండరు. ఈ మోసగాళ్లని మనం మోసగాళ్లగానే చూడాలిగానీ, వాళ్లని హార్ట్‌లోకి తీసుకోకూడదు. అది నా పర్సనల్ ఫీలింగ్. ఆయన పెద్దరికం కావాలి నాకు. ఆయన సలహాలు కావాలి. ఆయన ఐడియాలు కావాలి. అందుకే నేనే చెప్పా. దయచేసి నా మెసేజ్‌కి రిప్లయ్ ఇవ్వవద్దని చెప్పా. ఇప్పుడు ఆవేశంగా ఉండవచ్చు.. డిజప్పాయింట్‌గా ఉండవచ్చు. అందుకే ఇప్పుడు రిప్లయ్ ఇవ్వవద్దు అని చెప్పా. రెండు మూడు రోజుల తర్వాత నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పాను..’’ అని తెలిపారు.

Updated Date - 2021-10-12T02:21:13+05:30 IST