భారీ బందోబస్తు తో ‘మా’ ఎన్నికలు
ABN, First Publish Date - 2021-10-09T20:48:51+05:30
రేపు (అక్టోబర్ 10, 2021) జరగబోయే ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. దీని కోసం జూబ్లీ హిల్స్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎన్నికలకు మొత్తం 3గదుల్లో 12 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ఒకేసారి ఒకగదిలో నలుగురు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశముంది.
రేపు (అక్టోబర్ 10, 2021) జరగబోయే ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. దీని కోసం జూబ్లీ హిల్స్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎన్నికలకు మొత్తం 3గదుల్లో 12 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ఒకేసారి ఒకగదిలో నలుగురు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశముంది. దానికి తగ్గట్టుగానే పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పోలీసు బందోబస్తు కోసం 3 ప్లాటూన్ల బలగాల్ని వినియోగిస్తున్నారు. ఇందులో ఒక మహిళా ప్లాటూన్ కూడా ఉంది. మా ఎన్నికలు సందర్బంగా.. విమర్శలు, ప్రతి విమర్శలు చెలరేగిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఈ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ‘మా’ ఎన్నికల్లో మొత్తం 883 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.