ఫుటేజ్ ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం నాది కాదు: ‘మా’ ఎన్నికల అధికారి

ABN , First Publish Date - 2021-10-22T21:11:01+05:30 IST

‘మా’ ఎన్నికలలో వైకాపా ప్రమేయం ఉందంటూ ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా కొన్ని ఆధారాలను పోస్ట్ చేసిన నేపథ్యంలో కృష్ణమోహన్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సీసీటీవీ ఫుటేజ్ వ్యవహారం ఇప్పుడు నా

ఫుటేజ్ ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం నాది కాదు: ‘మా’ ఎన్నికల అధికారి

ప్రకాశ్ రాజ్ అడిగిన ‘మా’ ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం నా పరిధిలో లేదని, అది ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు పరిధిలో ఉంటుందని అన్నారు ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్. ‘మా’ ఎన్నికలలో వైకాపా ప్రమేయం ఉందంటూ ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా కొన్ని ఆధారాలను పోస్ట్ చేసిన నేపథ్యంలో కృష్ణమోహన్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సీసీటీవీ ఫుటేజ్ వ్యవహారం ఇప్పుడు నా పరిధిలో లేదు. ఆ ఫుటేజ్ ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం ఇప్పుడు ‘మా’ అధ్యక్షుడైన మంచు విష్ణు పరిధిలో ఉంది. అలాగే ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేస్తున్న వ్యక్తులపై యాక్షన్ తీసుకునే నిర్ణయం కూడా మంచు విష్ణుకే ఉంది. ‘మా’ ఎన్నికలు నిర్వహించడంతో నా బాధ్యత పూర్తయింది. ఆ తర్వాత జరిగే పరిణామాలు నా పరిధిలోకి రావు. ‘మా’ ఎన్నికలు జరిగిన సమయంలో కానీ, కౌంటింగ్ సమయంలో కానీ ఏవైనా ఫిర్యాదులు వచ్చి ఉంటే.. ఖచ్చితంగా చర్యలు తీసుకునేవాడిని. అప్పుడు ఎవరూ ఫిర్యాదు చేయలేదు..’’ అని కృష్ణమోషన్ వెల్లడించారు.

Updated Date - 2021-10-22T21:11:01+05:30 IST

Read more