సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Hema టచ్ చేయనిది ఎవరిని..? : కరాటే కల్యాణి సెటైర్స్

ABN, First Publish Date - 2021-10-10T18:22:00+05:30

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎన్నడూ లేనంత రసవత్తరంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎన్నడూ లేనంత రసవత్తరంగా జరుగుతున్నాయి. ఎవరికి వారు ఓటేసి ప్రశాంతంగా వెళ్లిపోతున్నప్పటికీ అటు ప్రకాష్ రాజ్ ప్యానెల్- ఇటు మంచు విష్ణు ప్యానెల్ మధ్య మాత్రం ఎన్నికల రోజు కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు.. ముఖ్యంగా కౌగిలింతలు, కొరుకులాటల మధ్య ఎన్నికలు కొనసాగుతున్నాయి. నటి హేమ.. నటుడు శివ బాలాజీ చేయి కొరకడంతో పెద్ద హంగామానే జరిగింది. తాను కావాల్సిందే కొరకలేదని హేమ.. తన ఎడమచేతికి పంటిగాట్లు పడ్డాయని శివ బాలాజీ ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన కొరుకులాట కాస్త ప్యానెళ్ల మధ్య చేరడంతో వీకే నరేష్, విష్ణు ఎంటరై ఇద్దరికీ సర్ది చెప్పడంతో కాస్త సద్దుమణిగింది.


హేమ టచ్ చేయనిది ఎవరిని..!?

ఈ క్రమంలో జూనియర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. హేమపై సెటైర్లేశారు. హేమ టచ్ చేయనిది ఎవరిని..?. ఆమె అందర్నీ టచ్ చేస్తోంది. గొడవలు ఏమీ జరగట్లేదు. అంతా ప్రశాంతంగానే ఉంది. రిగ్గింగ్ జరిగిందన్న విషయం అబద్ధం.. అంత అవసరం ఏమీ లేదు. మా ప్యానెల్ కచ్చితంగా గెలుస్తుంది. ఎన్నికలు అనేవి ఇలా కోలాహలంగా ఉంటేనే అందరికీ బాగుంటుంది. అసలేం జరుగుతోందని విషయం ప్రజలకు తెలుస్తుంది. మా ప్యానెల్ గెలుస్తుందని భీమవరం లాంటి ప్రాంతాల్లో బెట్టింగ్‌‌లు కూడా కాశారని తెలిసింది అని కళ్యాణి వ్యాఖ్యానించారు. 


మరోవైపు నరేష్ మాట్లాడుతూ.. హేమ శివ బాలాజీ చేయి కొరికిందని, ఆమెను టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదని.. ఎవరూ ఆ ప్రయత్నం చేయరని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో నో ఫైటింగ్.. ఓన్లీ ఓటింగ్ అని నరేష్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. మరో గంటలో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. ఇప్పటి వరకూ 380 మంది నటీనటులు ఓటు హక్కు వినియోగించుకో ఇంకా అగ్రహీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్ట్‌లు ఓటు హక్కు వినియోగించుకోనే లేదు. అంతేకాదు ఇరు ప్యానెళ్లలోని కొందరు సభ్యులే ఇంకా ఓటేయడానికి రాకపోవడం గమనార్హం.

Updated Date - 2021-10-10T18:22:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!