మా అమ్మను కించపరిచేలా తిట్టారు: తనీష్

ABN , First Publish Date - 2021-10-12T23:43:16+05:30 IST

ఓట్ల లెక్కింపు సమయంలో మోహన్‌బాబు అసభ్యపదజాలంతో తిడుతూ నన్ను కొట్టడానికి వచ్చారని అన్నారు హీరో తనీష్. ‘మా’ ఎన్నికలలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున ఈసీ మెంబర్‌గా పోటీ చేసిన తనీష్ తాజాగా జరిగిన మీడియా

మా అమ్మను కించపరిచేలా తిట్టారు: తనీష్

ఓట్ల లెక్కింపు సమయంలో మోహన్‌బాబు అసభ్యపదజాలంతో తిడుతూ నన్ను కొట్టడానికి వచ్చారని అన్నారు హీరో తనీష్. ‘మా’ ఎన్నికలలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున ఈసీ మెంబర్‌గా పోటీ చేసిన తనీష్ తాజాగా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘గతంలో కూడా నేను ఈసీ మెంబర్‌గా పనిచేశా. ‘మా’ సమావేశాలు జరిగినప్పుడు చాలా గొడవలు జరిగాయి. ముఖ్యంగా నరేశ్‌గారిని మేం పనిచేయనీయడం లేదని ఆయన చెప్పారు. కేవలం మేము ఈసీ మెంబర్స్‌మి మాత్రమే‌. ఆయన చేసే పనులను మేము అడ్డుకోవడానికి అస్కారం ఉంటుందా చెప్పండి. మోహన్‌బాబుగారు, విష్ణు, మనోజ్‌ అన్నలు అంటే నాకు చాలా ఇష్టం. ఓట్ల లెక్కింపు సమయంలో మోహన్‌బాబు అసభ్యపదజాలంతో తిడుతూ నన్ను కొట్టడానికి వచ్చారు. బెనర్జీగారు అడ్డుకునేందుకు వస్తే, ఆయనిని కూడా తిట్టారు. మా అమ్మను కించపరిచేలా తిట్టారు. ఆ తర్వాత విషయం తెలిసి, విష్ణు, మనోజ్‌ అన్నలు నన్ను ఓదార్చారు. అయినా ఆయన అన్న మాటలు జీర్ణించుకోలేకపోతున్నా. రేపు సమావేశాలు జరిగినప్పుడు ధైర్యంగా నా వాణి వినిపించలేను. అందుకే రాజీనామా చేస్తున్నా’’ అని తనీష్ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-12T23:43:16+05:30 IST