అక్కినేని హీరోలకు ఆ బ్యానర్‌ బాగా కలిసొచ్చింది!

ABN , First Publish Date - 2021-10-18T22:56:17+05:30 IST

అక్కినేని యువ హీరోలు నాగచైతన్య, అఖిల్‌ ఈ ఏడాది వరుస విజయాలు అందుకున్నారు. చైతూ ‘లవ్‌స్టోరీ’తో భారీ విజయం అందుకోగా, అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో తొలి విజయాన్ని అందుకున్నారు. దీనితో నాగార్జున్‌ హ్యాపీ మోడ్‌లో ఉన్నారు. ఓసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే ‘ఏమాయ చేశావె’ తర్వాత నాగచైతన్య అందుకున్న భారీ విజయం ‘100 పర్సెంట్‌ లవ్‌’. గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మించిన చిత్రమిది. ఆ చిత్రం నాగచైతన్య కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది.

ఇప్పుడు అఖిల్‌ అందుకున్న విజయం కూడా గీతా బ్యానర్‌ నుంచే! అఖిల్‌ ఇప్పటికి మూడు సినిమాల్లో నటించినా ఏదీ సరైన విజయాన్ని అందించలేదు. ‘అఖిల్‌’, బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టడంతో ‘హలో’ చిత్రంతో అఖిల్‌ను రీ లాంచ్‌ చేస్తున్నానని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం కూడా అంతంత మాత్రంగానే ఆడడంతో అఖిల్‌ ఆశలన్నీ ‘మిస్టర్‌ మజ్ను’ పైనే పెట్టుకున్నాడు. అది కూడా ఓ మాదిరి టాక్‌తో నడిచింది. సక్సెస్‌ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న అఖిల్‌కు ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో పర్ఫెక్ట్‌ హిట్‌ వచ్చింది.  దీనితో అభిమానులంతా గీతా ఆర్ట్స్‌ సంస్థ అక్కినేని హీరోలకు కలిసొచ్చిందని అంటున్నారు. అయితే సినిమా విడుదలకు ముందు చిత్ర నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసు కూడా ఇదే చెప్పారు. ‘అక్కినేని హీరోలు మా సంస్థకు కలిసొచ్చారు’ అని. ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేయనున్నారట అల్లు అరవింద్‌. దీనికి అల్లు అర్జున్‌ అతిథిగా హాజరవుతారు.

Updated Date - 2021-10-18T22:56:17+05:30 IST