సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నాన్న కోపానికి ప్రేమ ఎక్కువ!

ABN, First Publish Date - 2021-06-20T22:06:32+05:30

అమ్మ జన్మనిస్తుంది.. నాన్న జీవితాన్ని ఇస్తాడు.. తన భుజాన వేసుకుని లోకానికి పరిచయం చేస్తాడు.. చేయి పట్టుకుని మన గమ్యం వైపు అడుగులేయిస్తాడు.. తను పడిన కష్టం బిడ్డలు పడకూడదనీ.. మంచి భవిష్యత్తు ఇవ్వాలని తపన పడుతుంటాడు.. తన బిడ్డ ఉన్నత స్థాయికి ఎదిగే తాను శ్రమిస్తాడు.. బిడ్డల జీవితానికి ఓ స్ఫూర్తిగా నిలుస్తాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ్మ జన్మనిస్తుంది.. నాన్న జీవితాన్ని ఇస్తాడు..

తన భుజాన వేసుకుని లోకానికి పరిచయం చేస్తాడు..

చేయి పట్టుకుని మన గమ్యం వైపు అడుగులేయిస్తాడు..

తను పడిన కష్టం బిడ్డలు పడకూడదనీ..

మంచి భవిష్యత్తు ఇవ్వాలని తపన పడుతుంటాడు..

తన బిడ్డ ఉన్నత స్థాయికి ఎదిగే వరకు తాను శ్రమిస్తాడు..

బిడ్డల జీవితానికి ఓ స్ఫూర్తిగా నిలుస్తాడు...

అదీ నాన్నంటే...!!

ఆదివారం ఫాదర్స్‌ డే సందర్భంగా సినీ తారలు తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాల్ని పంచుకున్నారు. 







‘మన తండ్రీకొడుకుల అనుబంధం ఎన్నో సంవత్సరాల క్రితమే  స్నేహ బంధంగా మారినందుకు ఎంతో ఆనందిస్తున్నాను’ అంటూ వరుణ్‌ తేజ్‌ ఓ ఫొటో షేర్‌ చేశారు. 


‘మీతో గడిపే ప్రతి క్షణం విలువైనదే’ అని రామ్‌చరణ్‌ తన తండ్రి చిరంజీవితో దిగిన ఫొటో పంచుకున్నా రామ్‌చరణ్‌. 


రవితేజ తన తండ్రి, కుమారుడితో దిగిన ఫొటో షేర్‌ చేశారు. 


‘నాన్నా.. మీ గొప్పతనం గురించి చెప్పడానికి ఒక జీవితకాలం సరిపోదు. ఎల్లప్పుడు నాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు’  – శ్రీజ


‘మాకు రాజైన మహేశ్‌కు ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు. మనకు ఇష్టమైన వారు ఎప్పటికీ వదిలి వెళ్లరు. మన వెంటే ఉంటారు. డాడీ.. ప్రతి రోజూ నిన్ను గుర్తు చేసుకోవడం బాగుంది. కానీ నిన్ను చాలా మిస్‌ అవుతున్నా’’ – నమ్రత


అనుపమా పరమేశ్వరన్‌, కాజల్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. 




నువ్వు బెస్ట్‌ ఫ్రెండ్‌: మంచు లక్ష్మీ

‘నా జీవితంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు మీతోనే ఉన్నాయి. మన కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నువ్వు బెస్ట్‌ ఫ్రెండ్‌వి. నువ్వు మాలో స్ఫూర్తిని నింపావు. మీ ప్రోత్సాహం లేకపోతే మేమీ స్థాయిలో ఉండేవాళ్లం కాదు. థ్యాంక్యూ నాన్న. వి లవ్‌ యూ’’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు లక్ష్మీ మంచు. 


ప్రపంచంలో ఉన్న ప్రతి తండ్రికీ హ్యాపీ ఫాదర్స్‌ డే అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు అల్లు అర్జున్‌. 



ఆ కోపానికి ప్రేమ ఎక్కువ: చిరంజీవి

‘మా నాన్నకి కోపం ఎక్కువ.. కానీ ఆ కోపానికి ప్రేమ ఎక్కువ.. ఆ ప్రేమకి బాధ్యతా ఎక్కువే! తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతలను నెరవేర్చటం కోసం ప్రతిరోజూ కష్టపడే నాన్నలందరికీ ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు’’ అని చిరంజీవి పోస్ట్‌ చేశారు. 

నాన్న నా హీరో: మహేశ్‌బాబు

‘నా హీరో, అన్ని వేళల నన్ను గైడ్‌ చేేస చిరుదీపం, ఇన్స్‌పిరేషన్‌.. ఇవి మాత్రమే కాదు వీటన్నింటినీ మించిన వ్యక్తి మీరు. హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్న’ అని మహేశ్‌బాబు అన్నారు. 






Updated Date - 2021-06-20T22:06:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!