సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నన్ను వద్దన్న రాజశేఖర్.. మళ్లీ నా దగ్గరకే! గర్వంగా ఫీలయ్యా: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 49)

ABN, First Publish Date - 2021-08-03T02:23:55+05:30

నా బదులు రవిరాజా పినిశెట్టిగారిని పెట్టుకోమని హీరో రాజశేఖర్‌ చెప్పారట.. డిస్కషన్స్‌ పేరుతో నెలల తరబడి గడిపేసి ఆ తర్వాత సైలెంట్‌గా మరో డైరెక్టర్‌ను పెట్టుకుని షూటింగ్‌ చేసిన సందర్బాలు అనేకం. రాజశేఖర్‌ నా విషయంలో అలా చేయడం చాలా బాధగా అనిపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బయ్యర్లతో ఆ షాకింగ్ సంఘటన జరిగిన వారం రోజులకు నిర్మాతలు బెల్లంకొండ సురేశ్‌, శింగనమల రమేశ్‌ ఓ రోజు పొద్దున్నే నా దగ్గరకు వచ్చారు. ‘గురువుగారూ.. మీరేమీ అనుకోనంటే ఓ మాట చెబుతాం. మా సినిమాకు వేరే డైరెక్టర్‌ను పెట్టుకొంటున్నాం. మీరు కొంచెం కోపరేట్‌ చేయాలి’ అని మెల్లిగా చెప్పారు. ఆ మాట వినగానే నిర్ఘాంతపోయాను! ఇన్నేళ్ల నా కెరీర్‌లో సినిమా ఓపెనింగ్‌ చేసి, పేపర్లలో న్యూస్‌ వచ్చిన తర్వాత ఆ నిర్మాత వచ్చి ‘నా సినిమాకు మీ డైరెక్షన్‌ వద్దు’ అని చెప్పడం అదే మొదటిసారి. ఆ షాక్‌ నుంచి తేరుకొని ‘ అదేమిటి సార్‌.. మనం ఓపెనింగ్‌ చేశాం. అందరికీ తెలిసేలా పబ్లిసిటీ చేశాం. కొన్ని రోజుల్లో షూటింగ్‌ మొదలుపెట్టాలి. ఇప్పుడు వచ్చి మీరు ఇలా మాట్లాడటం తప్పు కదా సార్‌’ అన్నా.‘గురువుగారూ.. మీరేమీ అనుకోవద్దు. ఇందులో మా తప్పేమీ లేదు. హీరోగారే మిమ్మల్ని మార్చమని చెప్పారు’ అని అసలు విషయం చెప్పలేక చెప్పారు.


నా బదులు రవిరాజా పినిశెట్టిగారిని పెట్టుకోమని హీరో రాజశేఖర్‌ చెప్పారట.. డిస్కషన్స్‌ పేరుతో నెలల తరబడి గడిపేసి ఆ తర్వాత సైలెంట్‌గా మరో డైరెక్టర్‌ను పెట్టుకుని షూటింగ్‌ చేసిన సందర్బాలు అనేకం. పేర్లు చెప్పను కానీ నా విషయంలో పెద్ద పెద్ద నిర్మాతలే అలా చేశారు. అయితే ఓపెనింగ్‌ తర్వాత నన్ను తీసెయ్యడం అదే ప్రథమం. అదీ రాజశేఖర్‌ నా విషయంలో అలా చేయడం చాలా బాధగా అనిపించింది.. ‘ఓకే సార్‌ మీరు తప్పుకోమన్న తర్వాత కూడా నాకే కావాలని నేను పట్టపట్టను.. మీ హీరో చెప్పినట్లు చేయండి’ అని వాళ్లను పంపించేశాను. కానీ ఆ అవమానాన్ని భరించడం చాలా కష్టమైంది. బాగా ఆలోచించిన తర్వాత నాకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ దర్శకుల సంఘానికి ఓ లెటరు రాశాను. ‘మా అన్నయ్య’ సినిమాకు అడ్వాన్స్‌ కూడా తీసుకోలేదు. ‘నిర్మాతలు ఎక్కడికి పోతారా’ అని చాలా సినిమాలకు అడ్వాన్స్‌ తీసుకోకుండానే పని చేసిన సందర్భాలు ఉన్నాయి. తమ్మారెడ్డి భరద్వాజగారు అప్పట్లో దర్శకుల సంఘానికి అధ్యక్షునిగా ఉండేవారు. ఆయన నిర్మాతలతో మాట్లాడి కొంత డబ్బు ఇప్పించారు. ఆ కథ అక్కడితో ముగిసింది.


అలా అడగ్గానే గర్వంగా ఫీలయ్యా

అయితే ‘సుబ్బయ్య వద్దు.. మార్చేయ్యండి’ అని చెప్పిన రాజశేఖరే నాలుగేళ్ల తర్వాత మళ్లీ నాతో సినిమా చేయడానికి వచ్చారు. అది కూడా ఆయన సొంత సినిమా. ఒకరోజు ఉదయమే జీవిత, రాజశేఖర్‌ నా దగ్గరకు వచ్చారు. వారితో సి.కల్యాణ్‌ కూడా ఉన్నారు. ‘సుబ్బయ్యగారు.. మీ గతం మరిచిపోండి. ఒక సినిమా మాకు చేయాలి’ అన్నారు. వాళ్లు అలా అనగానే నేను గర్వంగా ఫీలయ్యాను. ఒకప్పుడు నన్ను వద్దనుకున్నారు. అలాంటి వాళ్లు ఓ మెట్టు దిగి నా దగ్గరకు వచ్చి సినిమా చేయమని అడుగుతున్నారు. ఇది ఒక రకంగా నాకు గెలుపే కదా. అందుకే ఆ సినిమా చేయడానికి అంగీకరించాను. పారితోషికం ఎంత ఇవ్వమంటారని కల్యాణ్‌ అడిగాడు. ‘నేను ఎంత తీసుకుంటున్నానో మీకు తెలుసు కదా.. అదే ఇవ్వండి’ అన్నాను. ఆ సమయంలో నేను పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకొంటున్నాను. కల్యాణ్‌ గీచిగీచి బేరం ఆడాడు. అది చాలా తక్కువ మొత్తమైనా నేను చేయను అని చెప్పకుండా సరేనన్నాను. ఎందుకంటే ఏ హీరో నన్ను వద్దన్నాడో అదే హీరో నన్ను పెట్టుకొని సొంత సినిమా చేయడం క్రెడిట్‌గా ఫీలయ్యాను. ఆ సినిమా పేరు ఆప్తుడు.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

Updated Date - 2021-08-03T02:23:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!