‘జీ కుటుంబం అవార్డ్స్-2021’కు నామినేషన్స్ షురూ
ABN, First Publish Date - 2021-09-15T22:32:42+05:30
జీ కుటుంబం అవార్డుల కార్యక్రమాన్ని 11వ సారి దిగ్విజయంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది ‘జీ తెలుగు’ ఛానల్. అద్భుతమైన కథలతో, ఆకట్టుకునే మలుపులతో ఎన్నో సీరియల్స్‌ని అందిస్తున్న జీ తెలుగు..
జీ కుటుంబం అవార్డుల కార్యక్రమాన్ని 11వ సారి దిగ్విజయంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది ‘జీ తెలుగు’ ఛానల్. అద్భుతమైన కథలతో, ఆకట్టుకునే మలుపులతో ఎన్నో సీరియల్స్‌ని అందిస్తున్న జీ తెలుగు ఛానల్.. సాధారణ ప్రజల కష్టసుఖాలను ప్రధాన ఇతివృత్తాలుగా తీసుకుని, వాటిని ఆకట్టుకునే రీతిలో అందిస్తూ తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. కష్టమొచ్చినా కరగనిది, నష్టమోచ్చినా చెరగనిది బంధాలతో నిండిన బంగారు కుటుంబం - జీ తెలుగు వారి కుటుంబం. ఆ అనుబంధాల్ని ఒక వేడుకలా చేసుకోవడమే ఈ అవార్డుల పండుగ. ఈ అవార్డుల కార్యక్రమంలో పాపులర్ వ్యూయర్స్ ఛాయిస్ నుంచి స్పెషల్ జ్యూరీ అవార్డుల వరకు ఎన్నో కేటగిరీలు ఉన్నాయి.
ఇక జీ కుటుంబం అవార్డుల విషయానికి వస్తే, ఇందులో విజేతల్ని ఓటింగ్ ప్రాసెస్ ద్వారా ఎన్నుకుంటారు. అభిమానులు, ప్రేక్షకులు తమకు నచ్చిన స్టార్స్‌కి ఓటు వేయవచ్చు. దీనికి 57575 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేసి వోట్ వేయవచ్చు లేదా జీ తెలుగు ఫేస్బుక్ మరియు ఇన్‌స్టాలో కామెంట్ చేయవచ్చు. ఇవేకాకుండా జీ 5 యాప్, వెబ్‌కు లాగిన్ అయ్యి జీ కుటుంబం అవార్డ్స్ పోర్టల్ ద్వారా కూడా ఓటు వేయవచ్చని జీ తెలుగు ప్రకటించింది. ఈ వోటింగ్ ప్రాసెస్ సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్నది. అతి త్వరలోనే జీ కుటుంబం అవార్డ్స్ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరుపనున్నట్లుగా ‘జీ తెలుగు’ ఓ ప్రకటనను విడుదల చేసింది.