సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'పుష్ప' ఫస్ట్ సింగిల్‌తో హైప్ తీసుకొస్తాడా..?

ABN, First Publish Date - 2021-06-20T13:57:52+05:30

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రానుందని తెలుస్తోంది. ఈ ఫస్ట్ సింగిల్‌తో 'పుష్ప' చిత్రంపై దేవి శ్రీ ప్రసాద్ హైప్ తీసుకురాగలడా అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోందట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రానుందని తెలుస్తోంది. ఈ ఫస్ట్ సింగిల్‌తో 'పుష్ప' చిత్రంపై దేవి శ్రీ ప్రసాద్ హైప్ తీసుకురాగలడా అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోందట. అల్లు అర్జున్ - సుకుమార్ - దేవి శ్రీ ప్రసాద్‌ల కాంబినేషన్ అంటే మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అని ఫిక్సవ్వాల్సిందే. అయితే గత రెండేళ్ళుగా దేవీ జోరు తగ్గింది. 'అల వైకుంఠపురములో' సినిమాకి థమన్ మ్యూజిక్ హైలెట్ అయినంతగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ప్లస్ కాలేకపోయిందనే మాట వినిపించిది. ఈ మధ్య థమన్ మ్యూజిక్ సెన్షేషన్‌గా అదరగొడుతున్నాడు. దాంతో రాక్ స్టార్‌కు 'పుష్ప' పెద్ద సవాల్‌గా మారింది. మరి ఈ సినిమాతో దాన్ని అధిగమిస్తాడా అన్నది త్వరలో రాబోతున్న ఫస్ట్ సింగిల్‌తో కొంత క్లారిటీ, కాన్‌ఫిడెన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పుష్ప రాజ్ ఇంట్రడ్యూసింగ్ టీజర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకొని సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది. 

Updated Date - 2021-06-20T13:57:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!