ఈ సినిమాతోనైనా టాలీవుడ్‌లో సెటిలవుతుందా..?
ABN , First Publish Date - 2021-06-13T17:43:54+05:30 IST
మాళవిక నాయర్ ప్రస్తుతం ఓ టాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. దీనితోనైనా అమ్మడి దశ, దిశ తిరుగుతుందా అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారట. 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమయిన ఈమె ఆ తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. ఈ సినిమా హిట్ మాళవికని క్రేజీ హీరోయిన్స్ లిస్ట్‌లో చేర్చలేదు. విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా'తో మరో హిట్ దక్కింది.

మాళవిక నాయర్ ప్రస్తుతం ఓ టాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. దీనితోనైనా అమ్మడి దశ, దిశ తిరుగుతుందా అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారట. 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమయిన ఈమె ఆ తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. ఈ సినిమా హిట్ మాళవికని క్రేజీ హీరోయిన్స్ లిస్ట్‌లో చేర్చలేదు. విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా'తో మరో హిట్ దక్కింది. అయినా ఈమె కెరీర్ నత్త నడకన సాగుతోంది. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న 'థ్యాంక్యూ' సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండగా ఓ హీరోయిన్‌గా మాళవిక కనిపించబోతోంది. అందం, నటన పరంగా ఈమె మంచి మార్కులు తెచ్చుకున్న లక్కే ఫేవర్ చేయడం లేదు. ఈ సినిమాతోనైనా అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి.