'శ్యామ్ సింగ రాయ్' ఓటీటీలో వచ్చేస్తుందా..?

ABN , First Publish Date - 2021-12-30T15:22:00+05:30 IST

'శ్యామ్ సింగ రాయ్' ఓటీటీలో వచ్చేస్తుందా..? ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని

'శ్యామ్ సింగ రాయ్' ఓటీటీలో వచ్చేస్తుందా..?

'శ్యామ్ సింగ రాయ్' ఓటీటీలో వచ్చేస్తుందా..? ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతూ దూసుకుపోతోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ ప్రధాన పాత్రలలో నటించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో రిలీజైన 'శ్యామ్ సింగ రాయ్' చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నానికి మంచి కమరిషియల్ హిట్ ఇచ్చింది. అయితే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ప్రముఖ ఓటీటీ అయిన నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగిందట. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో ఓటీటీ స్ట్రీమింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ న్యూస్. చూడాలి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో. 

Updated Date - 2021-12-30T15:22:00+05:30 IST