'భీమ్లా నాయక్' తర్వాతే 'విరాట పర్వం' రిలీజ్..?

ABN , First Publish Date - 2021-11-16T18:25:35+05:30 IST

'భీమ్లా నాయక్' తర్వాతే 'విరాట పర్వం' రిలీజ్ అని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. రానా - సాయి పల్లవి జంటగా..ప్రియమణి కీలక పాత్రలో నటించిన సినిమా 'విరాటపర్వం'.

'భీమ్లా నాయక్' తర్వాతే 'విరాట పర్వం' రిలీజ్..?

'భీమ్లా నాయక్' తర్వాతే 'విరాట పర్వం' రిలీజ్ అని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. రానా - సాయి పల్లవి జంటగా..ప్రియమణి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా రిలీజ్ ఇప్పుడే ఉండదని తెలుస్తోంది. రానా నక్సలైట్ పాత్రలో నటిస్తున్న దీనికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. సుధాకర్ చెరుకూరి - సురేశ్ బాబు ఈ సినిమాను నిర్మించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న 'విరాట పర్వం' ఓటీటీలో వచ్చేస్తుందని రూమర్స్ వస్తున్నాయి. 'నారప్ప', 'దృశ్యం 2' చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే 'విరాట పర్వం' కూడా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పుకుంటున్నారు. అయితే, తాజాగా వస్తున్న వార్తలను బట్టి ఈ సినిమాను 'భీమ్లా నాయక్' తర్వాత థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. 'భీమ్లా నాయక్' భారీ హిట్ సాధిస్తుందని ప్రతీఒక్కరు చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ మూవీ సక్సెస్ 'విరాట పర్వం' సినిమాకు ప్లస్ అవుతుందనే భావిస్తున్నారట. అందుకే త్వరలో ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.   


Updated Date - 2021-11-16T18:25:35+05:30 IST