వైష్ణవ్‌ తేజ్‌తో నాగార్జున సినిమా..!

ABN , First Publish Date - 2021-02-17T14:50:11+05:30 IST

వైష్ణవ్‌ తేజ్‌ మూడో చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మించబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

వైష్ణవ్‌ తేజ్‌తో నాగార్జున సినిమా..!

డెబ్యూ మూవీ 'ఉప్పెన'తో సెన్సేషనల్‌ హిట్‌ సాధించిన మెగా క్యాంప్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌తో ఇప్పుడు సినిమాలు చేయడానికి టాలీవుడ్‌ దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. 'ఉప్పెన' విడుదల కంటే ముందుగానే వైష్ణవ్‌ తేజ్‌ రెండో చిత్రాన్ని కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్‌ క్రిష్‌ దర్శక నిర్మాణంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో కలిసి వైష్ణవ్‌ తేజ్‌ సినిమా చేశాడు. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. అయితే ఇప్పుడు వైష్ణవ్‌ తేజ్‌ మూడో చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మించబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఓ డెబ్యూ డైరెక్టర్‌ తెరకెక్కిస్తాడని టాక్‌ వినిపిస్తోంది. జూలై నుంచి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. 


వైష్ణవ్‌తేజ్‌ తొలి చిత్రం 'ఉప్పెన' బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌తో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ముప్పైఐదు కోట్ల రూపాయలకు పైగా షేర్‌ వసూళ్లను సాధించింది. ఓ డెబ్యూ హీరో సినిమాకు ఈ రేంజ్‌ కలెక్షన్స్‌ రావడం ఓ రికార్డ్‌ అని టాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో శాండిల్‌వుడ్‌ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. కోలీవుడ్ విలక్షణ నటుడు.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. 

Updated Date - 2021-02-17T14:50:11+05:30 IST