స్పోర్ట్స్ డ్రామాలో వైష్ణవ్ తేజ్..!
ABN, First Publish Date - 2021-05-17T18:20:38+05:30
తొలి చిత్రం ‘ఉప్పెన’తో వందకోట్ల క్లబ్‌లో చేరిన మెగా క్యాంప్ హీరో వైష్ణవ్ తేజ్. త్వరలోనే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీలో నటించబోతున్నాడట. వివరాల్లోకెళ్తే..
తొలి చిత్రం ‘ఉప్పెన’తో వందకోట్ల క్లబ్‌లో చేరిన మెగా క్యాంప్ హీరో వైష్ణవ్ తేజ్. త్వరలోనే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీలో నటించబోతున్నాడట. వివరాల్లోకెళ్తే.. ‘ఉప్పెన’ విడుదలకు ముందే వైష్ణవ్ తేజ్, క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా పూర్తి చేసేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా, అలాగే అన్నపూర్ణ స్టూడియో నిర్మాణంలో మరో సినిమా చేయడానికి వైష్ణవ్ తేజ్ ఓకే చెప్పేశాడు. కాగా.. అన్నపూర్ణ స్టూడియో నిర్మించబోయే చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్లో తెరకెక్కనుందని సమాచారం. పృథ్వీ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించబోయే ఈ సినిమా హాకీ నేపథ్యంలో రూపొందనుందట. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.