'ఉప్పెన'కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సపోర్ట్..!
ABN , First Publish Date - 2021-02-02T18:19:15+05:30 IST
ఉప్పెన ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయబబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

సుప్రీమ్ హీరో సాయితేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం 'ఉప్పెన'. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ జతగా కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు నిర్మించాయి. ఇప్పటికే యూ ట్యూబ్‌లో విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన వస్తుంది. సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ త్వరలోనే 'ఉప్పెన' ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. సినీ వర్గాల సమాచారం మేరకు 'ఉప్పెన' సినిమా ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయబోతున్నారట. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.