అక్కడ ఆకట్టుకోలేకపోయిందా..?

ABN , First Publish Date - 2021-04-27T14:04:47+05:30 IST

ఉప్పెన సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 12న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయమవగా.. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్.. యంగ్ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్‌కి హీరో, హీరోయిన్స్‌గా పరిచయమయ్యారు.

అక్కడ ఆకట్టుకోలేకపోయిందా..?

ఉప్పెన సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 12న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయమవగా.. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్.. యంగ్ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్‌కి హీరో, హీరోయిన్స్‌గా పరిచయమయ్యారు. గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా దాదాపు సంవత్సరం పాటు ఆగిపోయింది. ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చినా కూడా మెగాస్టార్ సలహా మేరకు మేకర్స్ ఈ సినిమాని థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. అలాగే థియేటర్స్ ఓపెన్ అయి 100 పర్సెంట్ ఆక్యుపెన్సీతో రిలీజయిన ఉప్పెన ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.


ఈ నేపథ్యంలో సక్సెస్‌మీట్ నిర్వహించిన చిత్ర బృందం సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పగా... సుకుమార్ ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని నమ్మకంగా చెప్పాడు. అలాగే ఈ సినిమా 100 కోట్లు రాబట్టిందని ఆ తర్వాత పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ 20 ఏళ్ళ నుంచి ఉన్న రికార్డ్స్‌ని బ్రేక్ చేయడం కూడా గొప్ప విషయం. అయితే రీసెంట్‌గా ప్రముఖ తెలుగు ఎంటర్టైమెంట్ ఛానల్ స్టార్ మా లో ఏప్రిల్ 18న ప్రసారమైన ఉప్పెన.. స్మాల్ స్క్రీన్ పైన అంతగా సత్తా చాటలేదన్న మాట వినిపిస్తోంది. ఉప్పెన వంటి సినిమా స్మాల్ స్క్రీన్ మీద కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకొని హైయ్యెస్ట్ టి.ఆర్.పి రేటింగ్స్ రాబడుతుంటాయి. కానీ ఉప్పెన విషయంలో అలా జరగలేదని తెలుస్తోంది. ఖచ్చితమైన టి.ఆర్.పి రేటింగ్ తెలపలేదు గానీ బుల్లితెరమీద మాత్రం కొంత నిరాశపరచినట్టేనని మాట్లాడుకుంటున్నారు. 

Updated Date - 2021-04-27T14:04:47+05:30 IST