ప్రిన్స్‌కు ఈక్వల్‌గా సునీల్ క్యారెక్టర్..?
ABN , First Publish Date - 2021-05-15T17:11:44+05:30 IST
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రీసెంట్‌గా హ్యాట్రిక్ మూవీ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్‌కు త్రివిక్రమ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ రాస్తున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ - సునీల్ మధ్య కెరీర్ ప్రారంభం నుంచి ప్రత్యేకమైన అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రీసెంట్‌గా హ్యాట్రిక్ మూవీ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్‌కు త్రివిక్రమ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ రాస్తున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ - సునీల్ మధ్య కెరీర్ ప్రారంభం నుంచి ప్రత్యేకమైన అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. రచయితగా చాలా సినిమాలలో సునీల్‌కు మంచి పాత్రలు రాసి ఇండస్ట్రీలో క్రేజ్ వచ్చేందుకు ముఖ్య కారణం అయ్యాడు. ఈ క్రేజ్‌తో సునీల్ కమెడియన్‌గా ఒక వెలుగు వెలిగాడు. హీరోగాను కొన్ని సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. అయితే సునీల్ హీరోగా చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో కెరీర్ నెమ్మదించింది. దాంతో మళ్ళీ కామెడీ పాత్రలతో పాటు నెగిటివ్ పాత్రల మీద దృష్టి పెట్టాడు.
ఈ క్రమంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో చిత్రాలలో చిన్న పాత్రలు పోషించాడు సునీల్. అయితే అతడు, ఖలేజా, జల్సా, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాలకు వచ్చినంత పేరు ఈ సినిమాలకు రాలేదు. దాంతో మళ్ళీ మంచి పాత్ర క్రియేట్ చేసి ఫాంలోకి తీసుకు వచ్చేందుకు ట్రై చేస్తున్నాడట త్రివిక్రమ్. జులాయి, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలలో హీరో పాత్రతో సినిమా మొత్తం ట్రావెల్ అవుతూ గొప్ప పేరు తెచ్చుకుంటున్న రాజేంద్ర ప్రసాద్ మాదిరిగా సునీల్ పాత్రను ఈ సినిమాలో డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.