సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'ఆదిపురుష్ 3డి'లో సుదీప్..ఏ పాత్రలో అంటే..?

ABN, First Publish Date - 2021-05-04T19:43:16+05:30

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా 'ఆదిపురుష్ 3డి'‌. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నాడని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్‌ 3డి' ముంబైలో వేసిన ప్రత్యేకమైన సెట్స్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతోందని సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా 'ఆదిపురుష్ 3డి'‌. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నాడని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్‌ 3డి' ముంబైలో వేసిన ప్రత్యేకమైన సెట్స్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతోందని సమాచారం. రాముడిగా ప్రభాస్, సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లంకాధిపతి రావణాసురుడి సోదరుడు విభీషణుడి పాత్రలో కిచ్చా సుదీప్ కనిపించబోతున్నడని ప్రచారం సాగుతోంది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నాని - సమంత నటించిన 'ఈగ' సినిమాలో ముఖ్య పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలాగే 'బాహుబలి' సినిమాలోనూ కనిపించాడు. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్‌ 3డి'లో నటిస్తున్నాడట. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2022 ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ఇది వరకే మేకర్స్ ప్రకటించారు.  

Updated Date - 2021-05-04T19:43:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!