సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

శ్రియాను లైట్ తీసుకుంటున్నారా..?

ABN, First Publish Date - 2021-12-14T14:37:31+05:30

పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ విషయంలో శ్రియాను లైట్ తీసుకుంటున్నారా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధిన వార్తే వైరల్ అవుతోంది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ విషయంలో శ్రియాను లైట్ తీసుకుంటున్నారా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధిన వార్తే వైరల్ అవుతోంది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వచ్చే నెల సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఇప్పటికే ప్రమోషన్స్‌లో స్పీడు పెంచేశారు. ఈ ప్రమోషన్స్‌లో దర్శకుడు రాజమౌళి, హీరోలు చరణ్ - తారక్‌లతో పాటు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కూడా పాల్గొంటున్నారు. అయితే, ప్రమోషన్స్‌లో సీనియర్ హీరోయిన్ శ్రియా మిస్సవుతోంది. 'ఆర్ఆర్ఆర్' మూవీలో ఆమెది చాలా చిన్న రోల్ కావడంతో ప్రమోషన్స్‌కు తను అవసరం లేదనే ఆలోచనతోనే శ్రియాను పిలవలేదనే టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ ఇప్పుడు మాత్రం ఈ మ్యాటర్ బాగా వైరల్ అవుతోంది. అయితే, సినిమా రిలీజ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి త్వరలో రాజమౌళి బృందం శ్రియాను కూడా ప్రమోషన్స్‌లో భాగం చేసే అవకాశాలున్నాయని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.  

Updated Date - 2021-12-14T14:37:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!