#KGF 2 : బాలీవుడ్ సూపర్ హిట్ వింటేజ్ సాంగ్?
ABN , First Publish Date - 2021-12-29T19:15:45+05:30 IST
దక్షిణాది నుంచి వస్తోన్న మరో భారీ పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సూపర్ హిట్టయిన ‘కేజీఎఫ్’ చిత్రానికి కంటిన్యూషన్ అన్న సంగతి తెలిసిందే. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధిరా అనే విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మేకోవర్, లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఈ గ్యాప్ లో సినిమాకి సంబంధించిన ప్యాచ్ వర్క్ షూట్ జరుగుతోంది.

దక్షిణాది నుంచి వస్తోన్న మరో భారీ పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సూపర్ హిట్టయిన ‘కేజీఎఫ్’ చిత్రానికి కంటిన్యూషన్ అన్న సంగతి తెలిసిందే. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధిరా అనే విలన్ గా నటిస్తున్నారు. ఆయన మేకోవర్, లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఈ గ్యాప్ లో సినిమాకి సంబంధించిన ప్యాచ్ వర్క్ షూట్ జరుగుతోంది. ఇక ఈ సినిమా గురించి ఎగ్జైటింగ్ రూమర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
‘కేజీఎఫ్ 2’ చిత్రం కోసం ఓ బాలీవుడ్ వింటేజ్ సాంగ్ ట్రాక్ ను రీమిక్స్ చేశారట. ఆ సాంగ్ మరేదో కాదు.. సెన్సేషనల్ హిట్ అయిన ‘షోలే’ చిత్రంలోని మెహబూబా.. మెహబూబా సాంగ్ అని సమాచారం. విలన్ అయిన గబ్బర్ సింగ్ అంజాద్ ఖాన్ డెన్ లో ప్రత్యేక గీతంగా వచ్చే ఈ సాంగ్ అప్పటి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ఇన్నేళ్ళయినా ఈ క్లాసిక్ సాంగ్ ఏదో ఒక మూల మారుమ్రోగుతునే ఉంటుంది. హైదరాబాద్ లో ఇటీవల ఈ సాంగ్ షూట్ కూడా కంప్లీట్ చేశారట. దీనిపై మరింత క్లారిటీ రావల్సి ఉంది. మరి ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.