'సీటీమార్' మీదే సంపత్ నంది హోప్స్..?
ABN , First Publish Date - 2021-06-23T18:52:02+05:30 IST
యంగ్ డైరెక్టర్ సంపత్ నంది హోప్స్ అన్నీ ఆయన తాజాగా తెరకెక్కించిన 'సీటీమార్' సినిమా మీదే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. 2010లో దర్శకుడిగా పరిచయమవుతూ యంగ్ హీరో వరుణ్ సందేశ్ - నిషా అగర్వాల్ జంటగా 'ఏమైంది ఈ వేళ' సినిమా తీశాడు. ఈ సినిమా యావరేజ్ హిట్ అని టాక్ వచ్చినప్పటికీ ఏకంగా రెండవ సినిమా మెగా పవర్ స్టార్ రాం చరణ్‌తో 'రచ్చ' చేసే అవకాశం అందుకున్నాడు.

యంగ్ డైరెక్టర్ సంపత్ నంది హోప్స్ అన్నీ ఆయన తాజాగా తెరకెక్కించిన 'సీటీమార్' సినిమా మీదే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. 2010లో దర్శకుడిగా పరిచయమవుతూ యంగ్ హీరో వరుణ్ సందేశ్ - నిషా అగర్వాల్ జంటగా 'ఏమైంది ఈ వేళ' సినిమా తీశాడు. ఈ సినిమా యావరేజ్ హిట్ అని టాక్ వచ్చినప్పటికీ ఏకంగా రెండవ సినిమా మెగా పవర్ స్టార్ రాం చరణ్‌తో 'రచ్చ' చేసే అవకాశం అందుకున్నాడు. ఈ సినిమాతో చరణ్‌కి మంచి హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజతో 'బెంగాల్ టైగర్' తీసి మరో హిట్ అందుకున్నాడు. ఇలా రెండు వరుస సూపర్ హిట్స్ పడేసరికి స్టార్ డైరెక్టర్ అయిపోయాడని ఇండస్ట్రీలో అందరు మాట్లాడుకున్నారు. కానీ గోపీచంద్‌తో తీసిన 'గౌతమ్ నంద' తీవ్రంగా నిరాశపరచింది. దీని తర్వాత మళ్ళీ గోపీచంద్‌తోనే 'సీటీమార్' తీశాడు. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ పోస్ట్‌పోన్ అయింది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు గానీ, ఈ దర్శకుడి నమ్మకాలన్నీ దీనికి మీదే పెట్టుకున్నాడు. చూడాలి మరి 'సీటీమార్' సంపత్ నందికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో.