Samantha: ‘పుష్ప’ సాంగ్‌కు షాకింగ్ రెమ్యునరేషన్..?

ABN , First Publish Date - 2021-11-16T13:43:29+05:30 IST

‘పుష్ప’ మూవీలో సమంత ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ చేస్తున్నందుకు షాకింగ్ రెమ్యునరేషన్ అందుకుంటుందని తాజాగా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Samantha: ‘పుష్ప’ సాంగ్‌కు షాకింగ్ రెమ్యునరేషన్..?

‘పుష్ప’ మూవీలో సమంత ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ చేస్తున్నందుకు షాకింగ్ రెమ్యునరేషన్ అందుకుంటుందని తాజాగా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. అత్యంత ప్రతిస్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తాజాగా స్టార్ హీరోయిన్ సమంత ఓ ఐటమ్ సాంగ్ చేస్తుందని మేకర్స్ ప్రకటించారు. 


అయితే, ఈ సాంగ్ చేస్తున్నందుకు సమంత రెమ్యునరేషన్ రూ 1.5 కోట్లు తీసుకుందని సమాచారం. ఇదే నిజమైతే రికార్డ్ అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఐటెం సాంగ్స్ చేసిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, తమన్నాలు కూడా ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకోలేదు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న సమంతకు ‘పుష్ప’ మేకర్స్ ఒక్క సాంగ్‌కే భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ ఇప్పుడు ఈ న్యూస్ అంతటా వైరల్ అవుతోంది. కాగా, ఇదే మైత్రీ వారి నిర్మాణంలో సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.    

Updated Date - 2021-11-16T13:43:29+05:30 IST