'ఆర్‌ఆర్‌ఆర్' థియేట్రికల్ రైట్స్... హిస్టరీ క్రియేట్ చేస్తుందా?
ABN, First Publish Date - 2021-02-07T17:45:44+05:30
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్'. 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రీకరణ మొదలు పెట్టడానికి ముందు నుంచి జక్కన్న పక్కా ప్లానింగ్‌తో పావులు కదుపుతున్నాడు. ముఖ్యంగా సినిమాను మార్కెటింగ్ చేసే విషయంలో. రాజమౌళి ప్లానింగ్ ఎలా ఉందంటే..
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్'. కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తుండగా బాలీవుడ్ తారలు అజయ్ దేవగణ్, ఆలియా భట్ సహా హాలీవుడ్ తారలు ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి, కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రఖని ఇలా భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 1920 బ్యాక్‌డ్రాప్‌లో స్వాతంత్ర్యం కోసం పోరాడే ఇద్దరి నిజమైన పోరాట యోధులకు సంబంధించిన కల్పితగాథ. దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదలవుతుంది. ఈ సినిమాపై ఇంత క్రేజ్ ఉండటానికి గల కారణాలేంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది.
'బాహుబలి 2'ని క్రాస్ చేసేలా 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రీ రిలీజ్ బిజినెస్..
'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రీకరణ మొదలు పెట్టడానికి ముందు నుంచి జక్కన్న పక్కా ప్లానింగ్‌తో పావులు కదుపుతున్నాడు. ముఖ్యంగా సినిమాను మార్కెటింగ్ చేసే విషయంలో. రాజమౌళి ప్లానింగ్ ఎలా ఉందంటే.. తాను 'ఆర్‌ఆర్‌ఆర్' కోసం పెట్టిన పెట్టుబడినంతా థియేటర్స్ రైట్స్ నుంచి రాబట్టుకోవాలని అనుకుంటున్నాడట. 'ఆర్‌ఆర్‌ఆర్'ను రూ.400 కోట్లు ఖర్చు పెట్టి అన్‌కాంప్రమైజ్డ్‌గా తెరకెక్కిస్తున్నారు. కాగా.. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను రూ.520 కోట్లకు విక్రయించేలా ప్లాన్ చేశారట. అంతా అనుకున్నట్లు జరిగితే బాహుబలి 2 ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 'ఆర్‌ఆర్‌ఆర్' క్రాస్ చేస్తుందని టాక్. అందుకు తగినట్లుగానే ప్రాంతాల వారీగా భారీ రేట్స్‌ను చెబుతున్నారట 'ఆర్‌ఆర్‌ఆర్' మేకర్స్. అయితే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్ మూవీ కావడంతో సినిమాను భారీ రేట్స్ పెట్టి కొనడానికి నిర్మాతలు తెగ ఆసక్తిని చూపిస్తున్నారట. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు...
ఆంధ్ర - రూ. 165 కోట్లు
తెలంగాణ - రూ. 75 కోట్లు
కర్ణాటక - రూ.45 కోట్లు
కేరళ - రూ. 15 కోట్లు
తమిళనాడు - రూ. 50 కోట్లు
హిందీ - రూ. 100 కోట్లు
ఓవర్ సీస్ - రూ. 70 కోట్లు
మొత్తం - రూ.520 కోట్ల (థియేట్రికల్ రైట్స్ )
ఇది కనుక జరిగితే 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా హిస్టరీని క్రియేట్ చేసినట్లే అవుతుంది.