మళ్లీ షూటింగ్‌కు రియా?

ABN , First Publish Date - 2021-01-01T21:11:07+05:30 IST

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కారణంగా వివాదాల్లో చిక్కుకుంది హీరోయిన్ రియా చక్రవర్తి.

మళ్లీ షూటింగ్‌కు రియా?

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కారణంగా వివాదాల్లో చిక్కుకుంది హీరోయిన్ రియా చక్రవర్తి. ఆమె మీద తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడడంతో రియా జైలుకు కూడా వెళ్లింది. నెల రోజుల పాటు జైలు జీవితం గడిపింది. ఆ తరువాత బెయిల్‌పై విడుదలైంది. 


ఆమెతోపాటు ఆమె సోదరుడు కూడా అరెస్టై ఇటీవలె బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసు కారణంగా రియా తీవ్ర మనోవేదనకు గురైంది. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటోందట. త్వరలో సినిమా షూటింగ్‌కు కూడా హాజరుకాబోతోందట. రియా ఇప్పటికే ఓ చిన్న బడ్జెట్ సినిమాతో పాటు ఓ రియాలిటీ షోలో పాల్గొనేందుకు కూడా అంగీకారం తెలిపిందట. వచ్చే ఫిబ్రవరి నుంచి రియా షూటింగ్‌కు హాజరుకాబోతోందట. 

Updated Date - 2021-01-01T21:11:07+05:30 IST