ఓటీటీలో 'రిపబ్లిక్'..?

ABN , First Publish Date - 2021-06-03T17:54:58+05:30 IST

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న రిపబ్లిక్ సినిమా ఓటీటీలో విడుదల చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. 'సోలో బ్రతుకే సో బెటర్'తో హిట్ అందుకున్న సాయిధరమ్ తేజ్ టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్ట దర్శకత్వంలో నటించిన సినిమా 'రిపబ్లిక్'.

ఓటీటీలో 'రిపబ్లిక్'..?

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న 'రిపబ్లిక్' సినిమా ఓటీటీలో విడుదల చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. 'సోలో బ్రతుకే సో బెటర్'తో హిట్ అందుకున్న సాయిధరమ్ తేజ్ టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్ట దర్శకత్వంలో నటించిన సినిమా 'రిపబ్లిక్'. కేవలం 64 రోజుల్లో ఎలాంటి కరోనా కేసులు లేకుండా షూటింగ్ పూర్తి చేసిన చిత్ర బృందం జూన్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 'పే ఫర్ వ్యూ' పద్ధతిన ఓటీటీ రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చిత్ర బృందం జీ గ్రూప్ వారితో చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే కన్ఫర్మేషన్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ మేకర్స్ నుండి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. త్వరలో ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. కాగా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలలో కనిపించనున్నారు. 

Updated Date - 2021-06-03T17:54:58+05:30 IST