'RC15': ఇద్దరు బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఛాన్స్..?
ABN , First Publish Date - 2021-11-16T16:51:40+05:30 IST
మెగా హీరో రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'RC15' పేరుతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

మెగా హీరో రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'RC15' పేరుతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కాగా, ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'RC15'లో ఇద్దరు బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు అవకాశం దక్కినట్టు తాజా సమాచారం. వారే లోబో - విశ్వ. వీరికి చరణ్ సినిమాలో రోల్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఎలాంటి రోల్ వీరికి దర్శకుడు శంకర్ ఇస్తున్నారనేది తెలియాల్సింది. ఇప్పటికే లోబో 'ఆర్య 2', '100 % లవ్' లాంటి సినిమాలలో కనిపించాడు. ఇక బిగ్ బాస్ ద్వారా లోబో - విశ్వలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వచ్చింది.