చరణ్ బ్యానర్‌లో రవితేజ - విజయ్ సేతుపతి..!

ABN , First Publish Date - 2021-03-19T20:01:45+05:30 IST

గత కొత కాలంగా ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని మరో భాషలోకి రీమేక్ చేసేందుకు ఆయా దర్శక, నిర్మాతలు ఆరాటపడుతూ పోటీ పడుతున్నారు. ఈ వ్యవహారం అన్నీ భాషల్లోనూ జరుగుతోంది. ముఖ్యంగా తమిళ, మలయాళ

చరణ్ బ్యానర్‌లో రవితేజ - విజయ్ సేతుపతి..!

గత కొత కాలంగా ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని మరో భాషలోకి రీమేక్ చేసేందుకు ఆయా దర్శక, నిర్మాతలు ఆరాటపడుతూ పోటీ పడుతున్నారు. ఈ వ్యవహారం అన్నీ భాషల్లోనూ జరుగుతోంది. ముఖ్యంగా తమిళ, మలయాళ సినిమాలని మన భాషలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో తీయాలంటే కొన్ని లాభాలు..కొన్ని నష్టాలు ఉంటాయి. కథ రెడిమేడ్‌గా దొరికేస్తుంది. ఆ కథలో నటించడానికి హీరోలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొన్ని కథలు మన తెలుగు నేటివిటీకి తగ్గవి కాకపోతే మాత్రం ప్రేక్షకులు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాన్ని చెప్పేస్తారు. అందుకే మన నిర్మాతలు కొన్ని  సినిమాలని రీమేక్ చేయడం కూడా పెద్ద రిస్క్ అని చెప్పుకొస్తుంటారు.


ఇంతక ముందు సూపర్ గుడ్ ఫిలింస్, సురేష్ ప్రొడక్షన్స్‌లో బాగా తమిళ, మలయాళ సినిమాలు తెలుగులో రీమేకయి సక్సస్ సాధించాయి. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్‌లో వెంకటేష్ నటించిన నారప్ప..సెట్స్ మీద ఉన్న దృశ్యం 2 సినిమాలు పరభాషా చిత్రాలే. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా వేదాలం, లూసీఫర్ సినిమాలను రీమేక్ చేస్తున్నాడు. ముఖ్యంగా లూసీఫర్ సినిమా కథ విపరీతంగా మెగాస్టార్‌కి నచ్చడంతో రైట్స్ దక్కించుకున్నాడు చరణ్. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిచబోతున్నాడు. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్‌కి రెడీ అవుతోంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ హిట్ సినిమా వేదాలం కూడా ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకి వస్తుందన్న సమాచారం.


అయితే రాం చరణ్ మరొక రీమేక్ సినిమాని తన బ్యానర్‌లో నిర్మించబోతున్నాడని తాజా సమాచారం. ఇంతక ముందే 'డైవింగ్ లైసెన్స్' అన్న సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు చరణ్. 2019లో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మలయాళ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాం చరణ్ కలిసి నటించనున్నారన్న వార్తలు కూడా అప్పట్లో వచ్చి వైరలయ్యాయి. కాగా ఇప్పుడు ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ - విజయ్ సేతుపతి నటించబోతున్నారని తాజా సమాచారం. రాం చరణ్ ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయట. ఇక ఒరిజినల్ వెర్షన్‌లో పృథ్విరాజ్ సుకుమారన్,సూరజ్ వెంజరమూడు హీరోలుగా నటించారు. 

Updated Date - 2021-03-19T20:01:45+05:30 IST