‘ఖిలాడి’ తాజా అప్‌డేట్
ABN , First Publish Date - 2021-05-04T18:13:32+05:30 IST
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఖిలాడి'. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి...
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఖిలాడి'. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. హవీష్ ప్రొడక్షన్, పెన్ స్టూడియోస్ జయంతి లాల్ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాలు వాయిదా పడినట్లే.. ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడనుందని తెలుస్తోంది.
దర్శకుడు రమేశ్ వర్మ కరోనా బారినపడటంతో షూటింగ్‌కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి పరిస్థితులు కాస్త చక్కబడ్డ తర్వాత షూటింగ్ మొదలు పెట్టాలని హీరో రవితేజ, దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఈ కారణంగా సినిమాను అనుకున్న సమయంలో విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదు. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత.. బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసి.. ఫ్రెష్‌గా రిలీజ్ డేట్ ప్రకటించాలని నిర్మాతలు భావిస్తున్నట్లుగా సమాచారం.