రెండు సినిమాలకి రవితేజ షాకింగ్ రెమ్యూనరేషన్

ABN , First Publish Date - 2021-11-09T21:12:40+05:30 IST

మాస్ మహారాజా రవితేజ.. ఈ ఏడాదిని ‘క్రాక్’ బ్లాక్ బస్టర్ తో బోణి చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తెచ్చిపెట్టిన సక్సెస్ కిక్ తో ఎప్పుడూ లేని విధంగా సినిమాల మీద సినిమాలకి సైన్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ‘ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా’ చిత్రాలు సెట్స్ మీదుండగా రీసెంట్ గా రవితేజ 70వ సినిమా,71వ సినిమా కూడా అనౌన్స్ అయ్యాయి.

రెండు సినిమాలకి రవితేజ షాకింగ్ రెమ్యూనరేషన్

మాస్ మహారాజా రవితేజ.. ఈ ఏడాదిని ‘క్రాక్’ బ్లాక్ బస్టర్ తో బోణి చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తెచ్చిపెట్టిన సక్సెస్ కిక్ తో ఎప్పుడూ లేని విధంగా సినిమాల మీద సినిమాలకి సైన్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ‘ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా’ చిత్రాలు సెట్స్ మీదుండగా రీసెంట్ గా రవితేజ 70వ సినిమా,71వ సినిమా కూడా అనౌన్స్ అయ్యాయి. 70వ సినిమాకి ‘రావణాసుర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి సుధీర్ వర్మ దర్శకుడు.  71వ చిత్రానికి ‘టైగర్ నాగేశ్వరరావు’ టైటిల్ ను ఖాయం చేశారు. దీనికి వంశీ దర్శకుడు. ఈ సినిమా నొటోరియస్ క్రిమినల్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. 



అయితే ఈ రెండు సినిమాలకు రవితేజ పారితోషికం ఓ రేంజ్ లో పెంచేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటి కోసం రవితేజ ఏకంగా రూ. 18కోట్లు పారితోషికం అందుకున్నట్టు టాక్. అయితే ఈ రెండు సినిమాల్లోని విశేషమేంటంటే.. ఈ రెండింట్లోనూ రవితేజ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రల్ని పోషిస్తున్నారు. అందుకే ఈ రెండు సినిమాలకు రవితేజ పారితోషికాన్ని పెద్ద మొత్తంలో డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక  ఈ రెండు సినిమాల రెగ్యులర్ షూటింగ్స్ త్వరలోనే మొదలు కాబోతున్నాయి. 

Updated Date - 2021-11-09T21:12:40+05:30 IST