సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మరో తమిళ హీరోతో రష్మిక..?

ABN, First Publish Date - 2021-07-30T19:21:57+05:30

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మికమందన్న కోలీవుడ్ హీరోతో జతకట్టబోతోందని న్యూస్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈమె కోలీవుడ్‌లో కూడా అడుగుపెట్టి కార్తితో 'సుల్తాన్' సినిమా చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మికమందన్న కోలీవుడ్ హీరోతో జతకట్టబోతోందని న్యూస్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈమె కోలీవుడ్‌లో కూడా అడుగుపెట్టి కార్తితో 'సుల్తాన్' సినిమా చేసింది. ఈ సినిమా తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు రష్మిక క్రేజీ స్టార్‌గా మారింది. ఈ క్రమంలో మరో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించబోతున్న సినిమాలో రష్మికను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకి 'జాతి రత్నాలు' ఫేం కె.వి.అనుదీప్ దర్శకత్వం వహించబోతుండగా.. తెలుగు, తమిళంలో తెరకెక్కనుందట. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించబోతున్నారు. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

Updated Date - 2021-07-30T19:21:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!