యాక్టింగ్ క్లాస్‌లకు రష్మిక?
ABN , First Publish Date - 2021-02-21T17:33:38+05:30 IST
తెలుగులో వరుస విజయాలు సాధించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.

తెలుగులో వరుస విజయాలు సాధించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తున్న రష్మిక ప్రస్తుతం ఇతర భాషలపై కూడా ఫోకస్ చేస్తోంది. ఈ ఏడాది కార్తి `సుల్తాన్` సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా బాలీవుడ్‌పై కూడా దృష్టి సారించింది. సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న `మిషన్ మజ్ను` సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది.
`మిషన్ మజ్ను` కోసం రష్మిక ప్రత్యేకంగా సిద్ధమైందట. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. ఈ నేపథ్యంలో రష్మిక గత రెండు నెలలో పలు పర్యాయాలు ముంబైలో వర్క్‌షాప్‌లకు హాజరైందట. అలాగే కొన్ని ఆన్‌లైన్ క్లాస్‌లకు కూడా అటెండ్ అయిందట. తన పాత్రకు అవసరమైన అన్ని విషయాలను నేర్చుకుందట. ఇటీవలె సిద్ధార్థ్‌తో కలిసి లక్నోలోని షూటింగ్ స్పాట్‌కు వెళ్లింది. శాంతను బాగ్చి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రోనీ స్క్రూ వాలా నిర్మిస్తున్నారు.
