`రంగ్ దే`.. వేసవికి వాయిదా?
ABN , First Publish Date - 2021-01-01T21:20:15+05:30 IST
నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `రంగ్ దే`.
నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `రంగ్ దే`. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అయితే థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఉండడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు.
తాజాగా ఈ సినిమాను వేసవికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అప్పటికి 100శాతం ఆక్యుపెన్సీకి అనుమతి లభించే అవకాశాలు కనబడుతున్నాయి. అందుకనే `రంగ్ దే` సినిమాను మార్చి 26న విడుదల చేయాలనుకుంటున్నారట. లాంగ్ వీకెండ్‌తోపాటు హోలీ పండుగ కూడా ఉంది. అందుకే అదే డేట్‌ను అనుకుంటున్నారట.