సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కామెడీ వెబ్ సిరీస్‌లో రకుల్..?

ABN, First Publish Date - 2021-08-07T15:47:12+05:30

ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 'చెక్' సినిమాతో వచ్చిన రకుల్‌కి ఆ సినిమా ఆశించిన సక్సెస్‌ను ఇవ్వలేకపోయింది. క్రిష్ - వైష్ణవ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 'చెక్' సినిమాతో వచ్చిన రకుల్‌కి ఆ సినిమా ఆశించిన సక్సెస్‌ను ఇవ్వలేకపోయింది. క్రిష్ - వైష్ణవ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే 'అక్టోబర్ 31 లేడీస్ నైట్' అనే ద్విభాషా చిత్రంలో నటిస్తోంది.


ఇక బాలీవుడ్‌లో జాన్ అబ్రహాం నటిస్తున్న 'అటాక్' మూవీతో పాటు 'మేడే', 'డాక్టర్ జీ', 'థాంక్ గాడ్' చిత్రాలలో నటిస్తోంది రకుల్. ఈ క్రమంలోనే ఓ కామెడీ వెబ్ సిరీస్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు తాజాగా తన ఇన్స్టాగ్రాం అకౌంట్ ద్వారా ఓ క్యూట్ స్మైల్ పిక్‌ను షేర్ చేస్తూ 'సిరీస్ కమింగ్ సూన్' అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేసింది. ఇప్పటికే కాజల్, తమన్నా, సమంత లాంటి స్టార్ హీరోయిన్స్  డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు రకుల్ కూడా దీనికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. 



Updated Date - 2021-08-07T15:47:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!