జ‌క్క‌న్న షార్ట్ ఫిలిం... ఎవ‌రి గురించో తెలుసా?

ABN , First Publish Date - 2021-06-04T13:35:56+05:30 IST

స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రూపొందించే ప‌నిలో బిజీగా ఉన్నారు. అయితే ఇంత బిజీ షెడ్యూల్లోనూ ఆయ‌న మ‌రో సినిమా చేయబోతున్నారని సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌.

జ‌క్క‌న్న షార్ట్ ఫిలిం... ఎవ‌రి గురించో తెలుసా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రూపొందించే ప‌నిలో బిజీగా ఉన్నారు. అయితే ఇంత బిజీ షెడ్యూల్లోనూ ఆయ‌న మ‌రో సినిమా చేయబోతున్నారని సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌. అదేంటి.. ‘ఆర్ఆర్ఆర్’  కంటే ముందే రాజ‌మౌళి మ‌రో సినిమా చేస్తారా? అనే సందేహం రాక మాన‌దు. అయితే రాజ‌మౌళి చేయ‌బోయేది ఫీచ‌ర్ ఫిల్మ్ కాదు.. షార్ట్ ఫిల్మ్ అని స‌మాచారం. కొవిడ్ స‌మ‌యంలో ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌గా, ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి విధులు నిర్వ‌హిస్తున్న పోలీస్ డిపార్ట్‌మెంట్ గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసేలా రాజ‌మౌళి షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించ‌నున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ వివ‌రాల‌ను పోలీసు ఉన్న‌తాధికారుల‌కు తెలియ‌జేయ‌డం, వారు ఓకే చెప్ప‌డం జ‌రిగాయి. 19 నిమిషాల వ్య‌వ‌ధితో ద‌ర్శ‌క‌ధీరుడు పోలీసుల‌పై చేయ‌నున్న షార్ట్ ఫిల్మ్ గురించి త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి. 

Updated Date - 2021-06-04T13:35:56+05:30 IST