'ఆర్‌ఆర్‌ఆర్'.. గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న జక్కన్న
ABN , First Publish Date - 2021-01-01T16:45:44+05:30 IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్(రౌద్రం రణం రుధిరం)'.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్(రౌద్రం రణం రుధిరం)'. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, ఆంధ్ర ప్రాంతానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఇద్దరు స్వాతంత్ర్య యోధులకు సంబంధించిన కల్పిత గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ ప్యాన్ ఇండియా మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచచూస్తున్నారు. ఆలియాభట్, అజయ్ దేవగణ్ వంటి బాలీవుడ్ స్టార్స్ సహా హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ ఈ చిత్రంలో నటిస్తునున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత.