టైమ్ ట్రావెల్ కథతో రాహుల్ సాంకృత్యన్ ?
ABN, First Publish Date - 2021-12-27T16:48:53+05:30
ఇటీవల నేచురల్ స్టార్ నానీతో ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు రాహుల్ సాంకృత్యన్. పునర్జన్మ కథాంశంతో బెంగాల్ వాతావరణాన్ని అత్యంత సహజంగా చిత్రీకరించి ప్రేక్షకుల్ని అబ్బుర పరిచాడు. ఈ సినిమాతో రాహుల్ తో సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ వైవిధ్యమైన చిత్రాన్ని నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రాహుల్ ఒక టైమ్ ట్రావెల్ కథ రాసుకున్నాడట.
ఇటీవల నేచురల్ స్టార్ నానీతో ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు రాహుల్ సాంకృత్యన్. పునర్జన్మ కథాంశంతో బెంగాల్ వాతావరణాన్ని అత్యంత సహజంగా చిత్రీకరించి ప్రేక్షకుల్ని అబ్బుర పరిచాడు. రాహుల్‌తో సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ వైవిధ్యమైన చిత్రాన్ని నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రాహుల్ ఒక టైమ్ ట్రావెల్ కథ రాసుకున్నాడట. ఇది ‘ఆదిత్య 369’ చిత్రానికి మోడ్రన్ వెర్షన్‌లా అనిపిస్తుందట.
హీరో భూత, భవిష్యత్ కాలాలకు ఎలా వెళ్ళాడు? అక్కడేం చేశాడు అన్నది ఈ సినిమా కథాంశమని తెలుస్తోంది. మైత్రీలో చాలా మంది దర్శకులు అడ్వాన్స్ లు తీసుకున్నారు. ప్రస్తుతం వారంతా కథలు రాయడంలో బిజీగా ఉన్నారు. అయితే వారికి హీరోలే దొరకడం లేదు. మరి టైమ్ ట్రావెల్ కథకోసం రాహుల్ సాంకృత్యన్ కు ఏ హీరో దొరుకుతాడు? అన్నది ఆసక్తిగా మారింది.