'Radhe shyam': ప్రమోషన్స్‌లో స్పీడ్ పెరిగేదెప్పుడు..?
ABN , First Publish Date - 2021-12-14T13:31:22+05:30 IST
'రాధేశ్యామ్' మూవీ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెరిగేదెప్పుడు..? అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారట. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడిక్ లవ్ స్టోరి 'రాధేశ్యామ్'.

'రాధేశ్యామ్' మూవీ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెరిగేదెప్పుడు..? అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారట. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడిక్ లవ్ స్టోరి 'రాధేశ్యామ్'. యువ దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమాను న్యూ ఇయర్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల మేకర్స్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టి సినిమాలోని ఒక్కో పాటను వదులుతున్నారు.
కానీ, ఇప్పుడున్న భారీ పోటీలో ఇలాంటి ప్రమోషన్స్ 'రాధేశ్యామ్' చిత్రానికి ఎంతమాత్రం సరిపోవని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఒకరకంగా చూస్తే అది నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే, పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్', మాస్ మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్' సినిమాలతో పోటీగా వస్తోంది. ఇక 'రాధేశ్యామ్' మూవీ కంప్లీట్ రొమాంటిక్ లవ్ స్టోరి. కాబట్టి, గట్టిగా ప్రమోషన్స్ నిర్వహించి సినిమాపై ఊహించనివిధంగా అంచనాలు పెంచితేగానీ ఈ పోటీ తట్టుకొని నిలబడగలదు. లేదంటే రిజల్ట్ ఎలా ఉంటుదో చెప్పలేము. సరిగ్గా 'రాధేశ్యామ్' రిలీజ్‌కు నెలరోజులుంది.

ఇప్పటికే రాజమౌళి ప్రమోషన్స్‌లో తనమార్క్ చూపిస్తూ 'ఆర్ఆర్ఆర్' సినిమాను జనాలలోకి తీసుకువెళుతున్నారు. ఇక 'భీమ్లా నాయక్' సినిమా గురించి చెప్పనక్కర్లేదు. పవన్ మ్యానియాతో ఇప్పటికే భారీగా క్రేజ్ వచ్చేసింది. ప్రమోషన్స్ మొదలైతే అది మరో లెవల్‌కు చేరుకుంటుంది. ఎటొచ్చి 'రాధేశ్యామ్' మూవీ విషయంలోనే మేకర్స్ పావులు కదపాలి. అదే ఎప్పుడు అనేది అభిమానుల ప్రశ్న.
