'రాధే శ్యామ్': ప్రభాస్ బర్త్ డే రోజున స్పెషల్‌ టీజర్..!

ABN , First Publish Date - 2021-10-18T18:45:28+05:30 IST

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ వైటెడ్ మూవీస్‌లో 'రాధే శ్యామ్' ఒకటి. త్వరలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాలు చేస్తున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే.

'రాధే శ్యామ్': ప్రభాస్ బర్త్ డే రోజున స్పెషల్‌ టీజర్..!

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ వైటెడ్ మూవీస్‌లో 'రాధే శ్యామ్' ఒకటి. త్వరలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాలు చేస్తున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటలీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథను పునర్జన్మల కథా నేపథ్యంలో యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ - టి సిరీస్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ప్రభాస్ బర్త్ డే సందర్భంగా, అక్టోబర్ 23న టీజర్ రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, మోషన్ పోస్టర్ బాగా ఆకట్టుకున్నాయి. త్వరలో రాబోయో 'రాధే శ్యామ్' టీజర్ ఎలాంటి అంచనాలను పెంచుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. 

Updated Date - 2021-10-18T18:45:28+05:30 IST