సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Radhe shyam: దీపావళికి మరో టీజర్..?

ABN, First Publish Date - 2021-10-26T12:59:09+05:30

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కించిన పీరియాడిక్ లవ్ స్టోరీ 'రాధే శ్యామ్'. త్వరలో ఈ మూవీ నుంచి మరో టీజర్ రాబోతోందని తాజా న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కించిన పీరియాడిక్ లవ్ స్టోరీ 'రాధే శ్యామ్'. త్వరలో ఈ మూవీ నుంచి మరో టీజర్ రాబోతోందని తాజా న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రభాస్ సరసన మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీత దర్శకుడు. ఇటీవలే ఈ మూవీ నుంచి ప్రభాస్ పాత్రను రివీల్ చేస్తూ మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ అందరినీ బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే దీపావళి పండుగ సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ టీజర్‌తో చిత్రబృందం సర్‌ప్రైజ్ చేయబోతోందని సమాచారం. కాగా యూవీ క్రియేషన్ బ్యానర్‌పై వంశీ - ప్రమోద్ - ప్రసీద భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ 2022, సంక్రాంతి బరిలో దిగబోతోంది. 

Updated Date - 2021-10-26T12:59:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!