సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'ప్రాజెక్టు K': దీపిక ఉండేది వారం రోజులు మాత్రమే..?

ABN, First Publish Date - 2021-12-08T15:36:20+05:30

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదికొన్ జంటగా నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ 'ప్రాజెక్టు K'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదికొన్ జంటగా నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ 'ప్రాజెక్టు K'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీ పతాకంపై సి అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ షెడ్యుల్‌లో పాల్గొనేందుకు ముంబై నుంచి దీపక హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ - దీపికలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే, ఇది చాలా చిన్న షెడ్యూల్ అని తెలుస్తోంది. కేవలం వారం రోజులు మాత్రమే దీపిక 'ప్రాజెక్టు K' చిత్రానికి డేట్స్ ఇచ్చిందట. ఈ నెల 15 నుంచి షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'పఠాన్' మూవీ షెడ్యూల్‌లో పాల్గొనబోతోందని సమాచారం. అందుకే ఈ లోపు చిన్న షెడ్యూల్ పూర్తి చేసేందుకు ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా.. ప్రభాస్, పూజా హెగ్డే నటించిన 'రాధే శ్యామ్' సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అలాగే 'సలార్', 'ఆదిపురుష్' చిత్రాలలోనూ ప్రభాస్ నటిస్తున్నారు.    

Updated Date - 2021-12-08T15:36:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!