ప్రియా ప్రకాశ్ వారియర్ .. రూటు మార్చింది
ABN, First Publish Date - 2021-01-01T21:09:12+05:30
మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ త్వరలోనే తన కొత్త టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పించనుంది.
మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ పేరు వినగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది 'ఒరు ఆడార్ లవ్' చిత్రంలో ఆమె కన్ను కొట్టిన సీన్. ఆ ఒకే ఒక సీన్ ఆమెను రాత్రికి రాత్రే స్టార్‌ని చేసేసింది. ఒకానొక సందర్భంలో దర్శక నిర్మాతలు ఆమె జపం చేశారు కూడా. అయితే 'ఒరు ఆడార్ లవ్' ప్లాప్ కావడంతో ప్రియా ప్రకాశ్ వారియర్‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ప్రస్తుతం తెలుగులో నితిన్, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతోన్న 'చెక్' చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుంది. హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో తనలోని కొత్త టాలెంట్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తోందట ఈ మలయాళీ ముద్దుగుమ్మ. వివరాల మేరకు ప్రియా ప్రకాశ్ వారియర్ సింగర్‌గా తన టాలెంట్‌ను నిరూపించుకునే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే మలయాళం, కన్నడ భాషల్లో పాట పాడిన ప్రియా ప్రకాశ్ వారియర్ రీసెంట్‌గా తెలుగులోనూ పాట పాడిందట. శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహించిన ఓ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్ పాట పాడిందని వార్తలు వినిపిస్తున్నాయి.